“బోడి”ఫర్నిచర్ అప్పుడేమైంది..!

furnichr c

“బోడి ఫర్నిచర్”..ఈ మాట ఐదేళ్ళ కిందట గుర్తుకు వస్తే ఎంత బాగుండేదో. ఒక నిండు ప్రాణం ఈ రోజుకి బతికి ఇండేది. ఇది తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలు, సామాన్య జనం గుర్తు చేస్తున్న అంశం. అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి కక్ష సాధింపుల వైపు వెళ్ళక పోతే  ఆంద్రప్రదేశ్ లో ఈ రోజు వైసిపి స్థాయి వేరుగా ఉండేది. 2019లో అధికారం చేపట్టిన మరుక్షణమే జగన్ ప్రభుత్వం  కరకట్ట కూల్చివేతలు, కోడెల శివప్రసాద్ ఫర్నిచర్ వ్యవహారాలపై దృష్టి పెట్టిందే గానీ అసలు ప్రజలకు ఎలా దగ్గర కావాలి అనే నైతిక విషయాన్ని పట్టించుకోలేదు. కేవలం రెండు లక్షల రూపాయల ఫర్నిచర్ కోసం కోడెలను వెంటపడి మరీ వేధించారు. రాష్ట్ర విభజన తర్వాత హైదారాబాద్ నుంచి  తరలించిన  ఫర్నిచర్ తన వద్ద ఉందనీ, దాన్ని తీసుకువెళ్ళండని, లేకుంటే దానికి లెక్కడితే ఆ  మొత్తం చెల్లిస్తానని 2019 జూన్ నెలలోనే కోడెల జగన్ ప్రభుత్వానికి లేఖ రాసినా ఖాతరు చేయలేదు. ఆ తరువాత కొద్ది రోజులకు కోడెల ఏకంగా అప్పటి శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కి మరో లేఖ రాశారు.

తొక్కలో ఫర్నిచర్…నాని…

తన వద్ద ఉన్న ఫర్నిచర్ ని తీసుకు వెళ్ళమని, లేకుంటే దానికి ఎంత చెల్లించాలో వివరాలు పంపాలని కోడెల శివప్రసాద్ లేఖలో వివరించారు. కానీ, ఈ రెండు లేఖలు పట్టించుకోకుండా కోడెలపై ప్రభుత్వం ఏకంగా కేసు పెట్టడం గమనార్హం. రాజకీయంగా పల్నాడులో మచ్చలేని నేతగా పేరు తెచ్చుకున్న కోడెల చివరకు వైసీపీ నేతల ఆగడాలకు మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియనిది కాదు. ఇప్పుడు మొన్న ఎన్నికల్లో వైసీపీ ఇంటి దారి పట్టడంతో ఆ పార్టీ నేతలు చేసిన ఆగడాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. తాడేపల్లి లోని జగన్ అధికార నివాసంలో కోట్ల విలువైన ఫర్నిచర్ ఉందని కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గుర్తించింది. ఈ ఫర్నిచర్ పై జగన్ ఇంత వరకు ప్రకటన చేయకపోవడం చర్చకు దారి తీసింది. ఒకవైపు విశాఖ రిషికొండలో వందల కోట్ల విలువైన రాజ ప్రాసదం దుమారం రేపుతోంది. అందులో ఒక్క షవర్ టబ్బు విలువే 35 లక్షలుగా ప్రచారం అవుతోంది. అంతేకాదు, కేవలం డ్రైనేజీ వ్యవస్థకే 100 కోట్లు వెచ్చించినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇదంతా పక్కన పెడితే వైసిపి నేత నాని మాట్లాడిన తీరు రాజకీయ పరిశీలకులను విస్మయ పరుస్తోంది. కోడెల కేసుని మరచిపోయి “బోడి ఫర్నిచర్” తీసుకువెళ్ళండి, లేకుంటే ఎంతో చెప్పండి, తొక్కలో ఫర్నిచర్, డబ్బులు చెల్లిస్తాం అంటూ వ్యాఖ్యానించడం తాజా చర్చకు తెర లేపింది. ఇదే మాట కోడెల శివప్రసాద్ లేఖలు రాసినప్పుడు ఏమైందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిలదిస్తున్నాయి. మొన్నటి వరకు తాడేపల్లి జగన్ అధికార నివాసంలో ఉన్న ఫర్నిచర్ వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి అడుగు వేస్తుందో వేచి చూడాలి.

anagani
సత్య ప్రసాద్

ఇదిలా ఉంటే, ప్రతిపక్ష నేత జగన్ ఇంట్లో  ఉన్న ప్రభుత్వ ఫర్నీచర్  సరెండర్ చేయకుండా వాడుకుంటుూ  వైసీపీ నేతలు నీతులు  చెప్పడం సిగ్గుచేటని రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ వ్యాఖ్యానించారు.  గతంలో ఫర్నీచర్  విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్, స్వర్గీయ కోడెల శివప్రసాద్ గారిపై  అసత్య ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు.  కోడెల శివప్రసాద్ గారు తప్పు చేసి చనిపోలేదు .వైసీపీ నేతల వేధింపులకు గురై చనిపోయారని ఆరోపించారు. కోడెలది ఆత్మహత్య కాదని, వైసీపీ నేతలు చేసిన హత్య అన్నారు. నాడు కోడెల  శివప్రసాద్ రావుపై లేని పోని నిందలు వేసి  మంచి మనిషిని పొట్టన పెట్టుకోవడమే కాక కోడెల కుటుంబాన్ని మొత్తం మానసిక క్షోభ కు గురి చేసారన్నారు. K-టాక్స్ అని, ఫర్నిచర్ అని 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం పై మరకలు వేసి, నిందలు  మోపారని అనగాని అన్నారు. తన ఇంటి నుండి  ఫర్నిచర్ తీసుకెళ్లాలని  అప్పటి స్పీకర్ కు రెండు సార్లు   కోడెల శివప్రసాద్  లేఖలు  రాసినా పట్టించు కోకుండా  తప్పుడు కేసులు పెట్టడం కక్ష సాధింపు చర్యలకు నిదర్శనంగా పేర్కొన్నారు. విజయవాడ లోని తాడేపల్లి, హైదారాబాద్ లోని లోటస్ పాండ్ ఇళ్లలో రూ.50 కోట్ల ప్రభుత్వ సొమ్ముతో  ఫర్నిచర్, ఇతర వసతులకు ఖర్చు చేశారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *