"పేద్ద" బస్సు.. - EAGLE NEWS

“పేద్ద” బస్సు..

IMG 20240704 WA0007

విదేశాల్లో ట్రామ్ తరహాలో పొడవుగా ఉండే బస్సులు అందుబాటులో ఉన్నాయి. అందులో వంద మందికి పైగా ప్రయాణం చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం అటువంటి పొడవాటి బస్సులను భారత్ లో తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే ఈ పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ బస్సులో విమానం తరహాలో సౌకర్యాలు ఉంటాయని, 132 మంది కూర్చునే విధంగా రూపొందిస్తున్నామని గడ్కరీ పేర్కొన్నారు. ఈ బస్సు ప్రయాణించడానికి అనువుగా ఉండే ప్రాంతాల పై వివరాలు సేకరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *