ముంచెత్తిన వానలు…

IMG 20240708 WA0046

దేశ వాణిజ్య రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆరు గంటల పాటు ఏకధాటిగా కుంభవృష్టి కురవగా రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలో జన జీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ముంబయి వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో, 300 మిల్లీ మీటర్లకు పైగా వర్ష పాతం నమోదైంది. అత్యధికంగా గోవండి ప్రాంతంలో 315 మి.మి., పోవాయ్‌లో 314 మిల్లీ మీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. వర్షం కారణంగా సెంట్రల్‌ రైల్వే సబర్బన్‌ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పట్టాలు మునిగి పోవడంతో చాలా లోకల్‌ రైళ్ల రాకపోకలు నిలిచి పోయాయి. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.

IMG 20240708 WA0047

ముంబై, ఠాణె, పాల్ఘర్‌, రాయ్‌గడ్‌లో ప్రతి రోజు దాదాపు 30 లక్షల మంది సబర్బన్‌ లోకల్‌ రైలు సేవలను వినియోగించు కుంటారు. వర్షం కారణంగా ముంబయి లోని అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు రహదారులపై మోకాలి లోతు నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల ట్రాఫిక్‌ జామ్‌ కొనసాగుతోంది. అటు స్కూళ్లు, కాలేజీ లకు సెలవు ప్రకటించారు.ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రంగం లోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ముంబయితో పాటు ఠాణె, పాల్ఘర్‌, కొంకణ్‌ బెల్ట్‌కు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఇక, నిన్న ఠాణె లోని షాపూర్‌ ప్రాంతంలో ఓ రిసార్టును వరద నీరు చుట్టుముట్టగా అందులో చిక్కుకున్న 49 మందికి పైగా పర్యటకులను ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. పాల్ఘార్‌ జిల్లాలో పొలంలో పని చేస్తూ వరదలో చిక్కుకున్న 16 మంది గ్రామస్థులను అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షించాయి.ఇదిలా ఉంటే,వర్షాల కారణంగా 50కి పైగా విమానాలు రద్దయ్యాయి. కొద్దిసేపు రన్‌ వే కార్య కలాపాలను సస్పెండ్‌ చేయగా, మొత్తం 27 విమానాలను దారి మళ్లించారు. ఆ విమానాలన్నీ హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, ఇండోర్‌ వంటి ప్రాంతాల్లో ల్యాండ్‌ అయ్యాయి. దారి మళ్లించిన విమానాలకు ఆలస్యమైతే అవసరమైన ఏర్పాట్లు చేయడంపై దృష్టి సారిస్తామని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *