ముంబైలో “ఆక్వా లైన్” ..

IMG 20240725 WA0000

దేశ ఆర్థిక రాజధాని ముంబాయి మహా నగర వాసుల సుధీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ముంబాయిలో తొలి అండర్‌ గ్రౌండ్ మెట్రో సర్వీసు పట్టాలెక్కింది. దీనికి “ఆక్వా లైన్” అని పేరు పెట్టారు. మొదటి దశలో ఇది శాంటా క్రూజ్ ఎలక్ట్రానిక్స్ ఎక్స్‌పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ (సీప్‌జెడ్) నుండి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బికెసి) వరకు నడుస్తుంది. ఈ 33.5 కిలోమీటర్ల పొడవైన మార్గాన్ని కొలాబా – బాంద్రా- ఎస్పీజడ్ లైన్ గా వ్యవహరిస్తారు. ఈ మెట్రో పనులు 2017లో ప్రారంభమయ్యాయి. ఈ మార్గంలో ముంబై మెట్రో ఆరే కాలనీ నుండి కఫ్ పరేడ్ వరకు 27 స్టేషన్ల మధ్య నడుస్తుంది. రైలు కఫ్ పరేడ్, విధాన్ భవన్, చర్చ్‌గేట్, హుతాత్మా చౌక్, సిఎస్టీ, మెట్రో, కల్బాదేవి, గిర్గావ్, గ్రాంట్ రోడ్, ముంబై సెంట్రల్ మెట్రో, మహాలక్ష్మి, సైన్స్ మ్యూజియం తోపాటు ఆచార్య ఆత్రే చౌక్, వర్లీ, సిద్ధివినాయక్, దాదర్, సీతాలాదేవి, ధారవి, శాంతా, విద్యానగరి క్రజ్, డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్, సహర్ రోడ్, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, మరోల్ నాకా, ఎంఐడిసి, ఆరే డిపో స్టేషన్స్ లో పరుగులు పెడుతుంది. ఇక ఈ మెట్రో సర్వీసు సమయాలు ఉదయం 6:30 నుండి రాత్రి 11:00 గంటల వరకు ఉంటాయి. రైళ్లు గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. దీని కారణంగా 35 కిలో మీటర్ల సుదీర్ఘ ప్రయాణం దాదాపు 50 నిమిషాల్లో పూర్తవుతుంది. రోడ్డు మార్గంలో ఈ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది.కొత్త రవాణా వ్యవస్థ అందుబాటులోకి రావడంతో కేవలం ముంబయి వాసులే కాక, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వారు సైతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *