పోరాటం @ 25

IMG 20240726 WA0011

కార్గిల్…. ఇది ప్రతి భారతీయుడిలోనూ చెరగని ముద్ర వేసిన పేరు. సరిహద్దులను దాటుకుని అక్రమంగా మనదేశంలోకి చొరబడ్డ పాకిస్తాన్ సైన్యం, మిలిటెంట్లను మన జవాన్లు తరిమి కొట్టిన ప్రదేశం కార్గిల్. కార్గిల్‌ను విడిపించుకునే క్రమంలో పాకిస్తాన్‌పై ఓ చిన్న పాటి యుద్ధమే చేసింది భారత్. ఈ క్రమంలో 490 మంది ఆర్మీ అధికారులు, సైనికులు వీరమరణం పొందారు. సైనికపరంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం కూడా. దీన్ని స్వాధీనం చేసుకోవడానికి కార్గిల్ జిల్లా ఉత్తర ప్రాంతంలో నియంత్రణ రేఖను దాటుకుని భారత భూభాగంలోకి ప్రవేశించారు పాక్ సైనికులు, ఉగ్రవాదులు. కార్గిల్‌ చొరబాటును తొలిసారిగా 1999 మేలో గుర్తించారు. ఆ వెంటనే అప్పటి కేంద్ర ప్రభుత్వం సైనిక చర్యకు దిగింది.అత్యంత సంక్లిష్టమైన పర్వత పంక్తుల మధ్య రెండున్నర నెలల పాటు పాక్‌తో యుద్ధాన్ని కొనసాగించింది భారత్.

IMG 20240726 WA0009

దీనికి ఆపరేషన్ విజయ్ అని పేరు పెట్టింది. పాకిస్తాన్ చొరబాటుదారులను తరిమికొట్టింది. ఆపరేషన్ విజయ్‌లో భాగంగా టైగర్ హిల్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంది. 1999 జులై 26వ తేదీన కార్గిల్‌ పాక్ చెర నుంచి విముక్తి కల్పించింది.లఢక్ ద్రాస్ సెక్టార్‌లో నిర్వహించబోయే 25వ కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొననున్నారు. అమరవీరులకు నివాళి అర్పించనున్నారు. ద్రాస్‌లో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 25వ కార్గిల్ విజయోత్సవ ఉత్సవాలను సైనికులతో కలిసి జరుపుకోనున్నారు.దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *