war - EAGLE NEWS
modi

ఇళ్లకు కేంద్రం పరిహారం

జమ్మూకశ్మీర్ రాష్ట్రం భారత్ – పాక్ సరిహద్దు గ్రామాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పాకిస్థాన్ సైన్యం దాడుల్లో ధ్వంసమైన ఇళ్లకు పరిహారం అందజేయనున్నట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది. ప్రధాని మోడీ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేస్తూ 25 కోట్ల రూపాయలను విడుదల చేసింది. సరిహద్దులో దెబ్బ తిన్న 2060 ఇళ్లకు ఈ పరిహారం ఇవ్వనున్నారు. పూర్తిగా ధ్వంసమైన ఇళ్లకు రూ.2 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు లక్షరూపాయల చొప్పున బాధితులకు అందజేస్తారు.

Read More
war stop c

కాళ్ళ బేరం ముందు”ఆత్మ గౌరవం”!

ఏ సంఘటనలోనైనా, ఏ కేసులోనైనా బాధితులకు న్యాయం జరిగిందంటే నిందితులకు సరైన శిక్ష పడ్డట్టు అర్ధం. కానీ, దేశ ఆత్మ గౌరవానికి భంగం కలిగించిన పహల్గాంలో పర్యాటకుల ఊచకోత ప్రభుత్వ చేతగాని తనానికీ, నిఘా వైఫల్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. ఆ సంఘటన అనంతరం జరిగిన అనేక పరిణామాలు అంతుపట్టకుండా ఉన్నాయి. చివరకు ముష్కరుల తుపాకులకు బలైన వారి ఆత్మలను  సైతం క్షోభ పెడుతున్నాయి. కాశ్మీరు లోయలో ఏరులై పారిన రక్తపు ధారలు ఇప్పుడు రాజకీయ పార్టీ…

Read More
war reviw c

“సిందూరం”కి మంచు దుప్పటి..l

పగ చల్లారిందా? ఎక్కుపెట్టిన “సుదర్శన చక్రం” నిస్సహాయంగా మిన్నకుండి పోయిందా? మంచు కొండల పచ్చిక బైళ్ళలో అమాయకులను విచక్షణా రహితంగా కాల్చి చంపిన ముష్కరులు ఏమైపోయారు? వాయు వేగంతో శత్రు దేశంపై విరుచుకు పడిన ఆవేశం అకస్మాత్తుగా ఎందుకు ఆవిరై పోయింది?  కాశ్మీర్ వాస్తవాధీన రేఖను ఎందుకు చెరిపివేయలేక పోయాం? ఇందులో ప్రపంచ “పెద్దన్న” జోక్యం ఏ మేరకు ఉంది?  అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ.ఎం.ఎఫ్.) ఒక్క రోజులోనే వేల కోట్ల రూపాయల నిధులు పాకిస్థాన్ కి…

Read More
sud cf

యుద్ధ భూమిలో “దివ్యాస్త్రం”…

మహాభారత, రామాయణ కాలాల్లో దుష్ట శిక్షణ కోసం అస్త్రంగా వాడినట్టు చెప్పుకునేది “సుదర్శన చక్రం”. మహా విష్ణు కుడి వైపు వెనుక చేతిలో ఉంటుందని ఇతిహాస ,పురాణాలు చెబుతున్నాయి. ఈ దివ్యాస్త్రమే శిశుపాలుని తల నరికింది. కురుక్షేత్ర యుద్ధంలో 14వ రోజు సూర్యుడిని కప్పి ఉంచడానికి ఉపయోగించారు.  అర్జునుడి కుమారుడి మరణానికి ప్రతీకారం తీర్చుకుని జయధ్రుతుడిని చంపడానికి కూడా దోహదపడింది . ఋగ్వేదంలో సుదర్శన చక్రాన్ని విష్ణువుకు చిహ్నంగా, కాల చక్రంగా, మహా భారతంలో కృష్ణుడి ఆయుధంగానూ సుదర్శన చక్త్రం ప్రసిద్ధి. ఈ…

Read More
IMG 20250214 WA0030

చైనాతో ఇలా చేద్దాం…

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ఖచ్చితంగా సమావేశమై, అన్ని విషయాలు మాట్లాడతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా మోదీతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రంప్‌ మాట్లాడారు. చైనా విషయంలో తన వ్యూహాన్ని స్పష్టం చేశారు. చైనాతో స్నేహ పూర్వక సంబంధాలను కోరుకుంటున్నాననే తప్ప గొడవలు కాదని తేల్చి చెప్పారు. భవిష్యత్‌లో అన్ని ప్రధాన దేశాలు కలిసి పని చేస్తాయనే ఆశాభావాన్ని ట్రంప్‌ వ్యక్తం చేశారు….

Read More
IMG 20240726 WA0011

పోరాటం @ 25

కార్గిల్…. ఇది ప్రతి భారతీయుడిలోనూ చెరగని ముద్ర వేసిన పేరు. సరిహద్దులను దాటుకుని అక్రమంగా మనదేశంలోకి చొరబడ్డ పాకిస్తాన్ సైన్యం, మిలిటెంట్లను మన జవాన్లు తరిమి కొట్టిన ప్రదేశం కార్గిల్. కార్గిల్‌ను విడిపించుకునే క్రమంలో పాకిస్తాన్‌పై ఓ చిన్న పాటి యుద్ధమే చేసింది భారత్. ఈ క్రమంలో 490 మంది ఆర్మీ అధికారులు, సైనికులు వీరమరణం పొందారు. సైనికపరంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం కూడా. దీన్ని స్వాధీనం చేసుకోవడానికి కార్గిల్ జిల్లా ఉత్తర ప్రాంతంలో నియంత్రణ రేఖను…

Read More
israil cf

మళ్లీ మొదలైంది…

కొంత కాలంగా స్తబ్దంగా ఉన్న ఇజ్రాయెల్‌ దేశంలో మళ్లీ ఉగ్ర మంటలు చెలరేగాయి. పాలస్తీనాకు చెందిన ఇస్లామిస్ట్ గ్రూపు హమాజ్‌ దక్షిణ ఇజ్రాయిల్‌లోకి చొరబడి ఇష్టానుసారంగా పౌరులపైకి  రాకెట్లను ప్రయోగించింది. దీంతో ఇజ్రాయిల్‌, పాలస్తీనాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.  గాజా స్ట్రిప్‌ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్‌ వైపునకు పెద్ద ఎత్తున మిస్సైల్స్‌ దాడులు జరిగాయి. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్‌ సైన్యం గాజా సరిహద్దులో ఎమర్జెన్సీ ప్రకటించింది. గాజా, గ్రేటర్‌ టెల్‌ అవీవ్‌ ప్రాంతం నుంచి పెద్ద…

Read More