అన్నను వదలని చెల్లెలు..!

Screenshot 20240728 210106 Gallery

రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడైనా అధికార పక్షాన్ని వేలెత్తి చూపుతాయి. ప్రజావ్యతిరేక విధానాల్లో లోపాలను ఎండగడతాయి. వాటి పరిష్కారానికి పోరాడతాయి. కానీ, ఆంద్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పై దృష్టి సారించాల్సిన కాంగ్రెస్ పార్టీ వైసీపీని రచ్చేకిడ్చే కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేజిక్కించుకున్న వైఎస్ షర్మిల కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా దక్కించుకోలేక పోయింది. ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా తన అన్న, వైసీపీ అధినేత జగన్ ను టార్గెట్ చేసి విమర్శలు చేసిన షర్మిల వైసీపీ ప్రభుత్వ పరాజయంలో తన వంతుగా కీలక పాత్ర పోషించారు.

Screenshot 20240728 210234 Gallery

ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కూడా అధికార టీడీపీ పార్టీని వదిలేసి అన్న జగన్, ఆయన పార్టీనే లక్ష్యంగా చేసుకుని షర్మిల విమర్శలు గుప్పిస్తున్నది. వైసీపీ ప్రభుత్వ పతనం తర్వాత కూడా షర్మిల చేస్తున్న ఆరోపణలు రాజకీయ పరిశీలకులను ఆలోచనల్లో పడేస్తున్నాయి. ప్రతీ సమావేశంలో జగన్ ను ఉద్దేశిస్తూ చేస్తున్న ఘాటైన విమర్శల వెనక షర్మిల ఎట్టుగడలపై దృష్టి పెట్టారు.కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల, వైసీపీ పార్టీ పూర్తిగా పతనమైతేనే కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం ఉంటుందని, అప్పుడే తన రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని అంచనా వేస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్నికల ముందు చివరి నిమిషంలో ఏపీ రాజకీయాలలోకి రావడం మూలంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా జనం తనను గుర్తించలేదని, అందుకే జగన్ కన్నా తానే న్యాయం చేయగలనన్న నమ్మకాన్ని కలిగించాల షర్మిల యోచిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాల ద్వారానే తెలుస్తోంది.వైసీపీ పార్టీలో ఉన్న నేతల్లో తొంభై శాతం పైగా కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిన వారు కావడం,వారిలో తిరిగి కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం కలిగించ గలిగితే తన వెంట నడుస్తారని ఆశిస్తున్నానని సమాచారం. గత ఎన్నికల్లో 151 శాసనసభ స్థానాల నుండి 11 స్థానాలకు పడిపోయిన వైసీపీ పార్టీని, జగన్ ను ప్రజలు ఇక ఆదరించరన్న సంకేతాలు బలంగా పంపడమే లక్ష్యంగా ఓటమి తర్వాత కూడా షర్మిల అన్న మీద విమర్శలు సంధిస్తున్నాటూ తెలుస్తోంది. తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి ఏ ఎన్నికలలోనూ పోటీ చేయకుండానే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన వైఎస్ షర్మిల ఆంధ్రాలో భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉంటుందో మరి కొంత కాలంలోనే తేలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *