కేరళ లోని వయనాడ్ విలయం తీవ్ర విషాదాన్ని నింపింది.. కొండ చరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరణించిన వారి సంఖ్య 310 కి చేరుకుంది. మండక్కై, చూరాల్ మల, అత్తమాల, నూల్పుజ ప్రాంతాల్లో దాదాపు 40 బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి, సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, నేవీతో పాటు ఇతర సహాయక బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు సైన్యం వందలాది మందిని కాపాడి సురక్షిత శిబిరాలకు తరలించాయి. వయనాడ్ విలయం.
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శిథిలాలను తీస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. అక్కడి హృదయ విదారక పరిస్థితులతో కలత చెందుతున్నట్లు శవ పరీక్షలు చేస్తున్న వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఛిద్రమైన మృతదేహాలకు పోస్టుమార్టం చేయలేక పారిపోవాలనుకున్నట్లు ఓ ప్రభుత్వ వైద్యురాలు చెప్పడం అక్కడి పరిస్థితులు ఎంత హృదయ విదారకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రకృతి సృష్టించే విపత్తును అడ్డుకోవడం ఎవరి తరం కాదు. ఆ విపత్తును ముందుగానే ఊహిస్తే కాస్త నష్టాన్ని నివారించగలము తప్పా, చేసేది ఏమీ ఉండదు. అలాంటి అవకాశాన్ని ఇస్రో అందించింది. ఈ సంస్థ రూపొందించి ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా 20 ఏండ్లుగా వయనాడ్ జిల్లాతో పాటు కేరళ లోని ప్రమాదకరమైన ప్రాంతాలను డాక్యుమెంటరీ రూపంలో చిత్రీకరించింది. దీనిలో భాగంగా తాజాగా వయనాడ్ జిల్లాలో విలయాన్ని చిత్రీకరించింది. వయనాడ్ లో కొండ చరియలు జారి పడిన దృశ్యాన్ని విలయానికి ముందు విలయం తర్వాత ఫొటోలను ఆ ప్రాంతాలపై దృష్టి సారించింది.