ఒలింపిక్ “టీమ్”..

IMG 20240805 WA0001

ప్యారిస్ లో జరుగుతున్న ఒలంపిక్స్-2024 ను సందర్శించేందుకు తెలంగాణ అధికార బృందం బయలుదేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ సలహాదారులు( క్రీడలు) జితేందర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్, ప్రకాష్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి ఎస్. వేణుగోపాల చారి, ఎం రవీందర్ రెడ్డిలు ఈ బృందంలో ఉన్నారు. క్రీడాకారులకు నైతిక మద్దతు అందించడంతోపాటు క్రీడా స్టేడియాల సందర్శన, ఒలంపిక్స్ పోటీలకు చేసిన ఏర్పాట్లు, భవిష్యత్తులో ఒలంపిక్స్ నిర్వహణకు ఉన్న అవకాశాల పరిశీలన, వివిధ దేశాలు క్రీడల్లో అభివృద్ధి సాధించడానికి అనుసరిస్తున్న విధానాలు, పతకాల పట్టికలో వివిధ దేశాలు ముందంజలో ఉండడానికి దోహదం చేస్తున్న కారణాలు పరిశీలించడానికి తెలంగాణలో అత్యుత్తమ క్రీడా విధానాన్ని ప్రకటించే ముందుకు క్షేత్రస్థాయి పర్యటన చేయాలని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. ఈ పర్యటన ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశిస్తున్న క్రీడల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ఉపయోగపడేలా,తెలంగాణలో క్రీడాభివృద్ధికి దోహదం చేసే ఆలోచనలకు దారితీస్తుందని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *