“రెడ్డి”ని ఓర్వలేని “దొరలు”..!

reddy dora c

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం తెలంగాణలో ఉద్యమ పార్టీగా చెప్పుకుంటున్న భారత రాష్ట్ర సమితి మనుగడ కష్టమేనా? అందుకే ప్రజా సమస్యలను పక్కన పెట్టిమరీ భారాస నేతలు రేవంత్ నే టార్గెట్ చేసుకున్నారా? భారాస శ్రేణులను ప్రేరేపించడానికి, కాంగ్రెస్ శ్రేణులను రెచ్చగొట్టడానికి కెటీఆర్, హరీష్ వంటి వారు వ్యూహ రచన చేస్తున్నారా? ఉద్యమ సమయంలో మాదిరిగా మోకా చూసుకొని అగ్గి రాజేయాలని పన్నాగం పన్నుతున్నారా? ఇలాంటి ప్రశ్నలకు భారాస నేతల పోకడ చూస్తే  అవుననే సమాధానం వస్తోంది. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీపై, సంక్షేమం పట్ల ప్రభుత్వం పై పోరాడాల్సిన నైతిక బాధ్యతను భారాస విస్మరిస్తోందనే వాదనలు పుట్టుకొస్తున్నాయి.

ktr 1

రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన భారత రాష్ట్ర సమితి నేతలు రాజకీయ విలువలకు తిలోదకాలు ఇస్తున్నట్టు కనిపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ప్రజలు అంట గట్టిన ప్రతి పక్ష హోదాను తుంగలో తొక్కి, కాంగ్రెస్ ప్రభుత్వం పై కక్ష సాధింపు ధోరణిగా వ్యవహరించడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్య పరుస్తోంది. ప్రజా సమస్యలను అధ్యయనం చేసి, వాటి పరిష్కారానికి పోరాడాల్సిన భారాస నేతలు కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాత్రమే టార్గెట్ గా చేసుకోవడం అంతుపట్టని విషయం. గతంలో మీరే ముఖ్యమంత్రి కావాలని  ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కు ఉచిత సలహాలు ఇవ్వడం, ప్రభుత్వం చేపట్టే ప్రతీ కార్యక్రమం పై కొర్రీలు పెట్టే ప్రకటనలు చేయడం, రేవంత్ రెడ్డి ఆయన మంత్రి వర్గం పనితీరుపై పనిగట్టుకొని ఊహాజనిత ఆరోపణలు, విమర్శలు చేయడాన్ని సైతం ప్రజలు తప్పు పడుతున్నారు.

reddy in1

ఒకవైపు ఎదైనా కార్యక్రమం జరుగుతుంటే అందులోని ప్రజా సంక్షేమ అంశాన్ని పక్కన పెట్టి “కోడిగుడ్డు మీద ఈకలు వెతికిన” చందంగా కెటీఆర్, హరీష్ రావు వంటి నేతలు రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం ఈ మధ్య అధికమైంది. గత శాసన సభలో ముఖ్యమంత్రి కెటీఆర్ కి చేసిన సూచనలను వక్రీకరించి వివాదం చేయాలనుకున్న భారాస నేతలు, మొన్న ఆర్టీసీ బసుల్లో ఆడపడుచులపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యాలతో ఒక్కసారిగా నాలుక కరుచుకున్నారు. ఇక, ఆగష్టు నెల లోపు రైతు రుణ మాఫీ చేస్తే ఎం.ఎల్.ఏ. పదవికి రాజీనామా చేస్తా అంటూ గతంలో హరీష్ రావు ముఖ్యమంత్రికి విసిరిన సవాల్ ఇప్పుడు భారాసకు తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం మూడు దశల్లో రుణ మాఫీ చేసిన సంగతి తెలిసి కూడా దానిపై పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి భారాస తెరలేపే ప్రయత్నం చేయడం సామాన్యులకు సైతం నచ్చడం లేదు.

redy dora c

కొన్ని ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రాజీనామా చేయాలంటూ ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం భారాస ఎత్తులకు పరాకాష్టగా కనిపిస్తోంది. మొన్న రేవంత్ రెడ్డి అధికారిక అమెరికా పర్యటనను, ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి ఆస్ట్రేలియా వ్యాపార పర్యటనను కూడా కెటీఆర్ రాజకీయం చేయాలని ప్రయత్నించడం రేవంత్ పై వ్యక్తి గత కక్షకు అద్దం పడుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు తేల్చి చెబుతున్నారు. అంతేకాదు, రేవంత్ రెడ్డి మానసికంగా స్థిరంగా లేరని కేటీఆర్ చేసిన  ఘాటైన మాటలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది. మొన్న భారాస నేతలు చెచ్చిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఫలితమే సిద్దిపేటలో తాజా ఘటనకు నిదర్శనంగా భావిస్తున్నారు. భారాస నేతలు ఈ స్థాయిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కార్యక్రమాలు చేస్తున్నారో అందుకు ధీటుగా కాంగ్రెస్ శ్రేణులు ప్రతిఘటించే చర్యలకు దిగడం నిజంగా ఆందోళన కలిగించే అంశం. ప్రతిపక్షం నుంచి ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఏమో గానీ శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.

reddy in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *