రోగమా…ధర్మమా…!

physic.jpg c

“సనాతన ధర్మం” అనే పదాన్ని సాకుగా నూలుపోగు లేకుండా వీధుల్లో సంచరిస్తున్న ఓ మానసిక రోగి పట్ల పోలీసులు,ఇతర ప్రభుత్వ అధికారులు అవలంభిస్తున్న తీరు ఆందోళనకు గురి చేస్తోంది. దిశా, నిర్దేశం లేకుండా, పోలీసులు, దేవాలయాధికారులకు సమాచారం ఇవ్వకుండా ఓ కారు వేసుకొని నగ్నంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై విచ్చల విడిగా తిరుగుతున్న సాధు మహిళ పై ప్రభుత్వాలు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయనేది ప్రశ్నార్థకం. తనను అడ్డుకున్న పోలీసు అధికారులపై లేనిపోని అభాండాలు వేయడం, తన యద భాగాన్ని ఎందుకు తాకారు అంటూ రచ్చ చేసే ఎత్తులు పన్నడం ఆమెకు పరిపాటైంది. విజయవాడలో ఇలాంటి సంఘటనే జరిగింది. మొన్న వేములవాడలో ఆమెను అడ్డుకున్న వారిపై ఏకంగా దాడికి దిగడం మరో నేరం. వస్త్రాలు ధరించి దర్శనం చేసుకోవలసిందిగా దేవాలయ సిబ్బంది చేసిన సూచనలను ఖాతరు చేయకుండా కోపంతో అక్కడి భక్తులను బెదిరిస్తూ దాడికి పాల్పడే ప్రయత్నం చేసింది. ఈ విషయం తెలిసి కూడా పోలీసులు ఆమెను కారు ఎక్కించి మర్యాదగా  పంపడం ఆమె అరాచకాన్ని ప్రోత్సహించడమేనని హేతువాద సంఘాలు మండిపడుతున్నాయి.

అదుపులేని అ”ఘోరం”

సనాతన ధర్మ పరిరక్షణకు అనేక పద్ధతులు ఉంటాయని, మహిళగా ఒంటి మీద బట్టలు లేకుండా జనం మధ్య సంచరించడం ఎదుటి వారికి అసౌకరం (న్యూసెన్స్) అని, ఈ సెక్షన్ కింద ఆమెను అదుపులోకి తీసుకోవచ్చని సూచిస్తున్నారు. ఆమె అడుగు పెడుతున్న ప్రతీచోటా ఇదే పరిస్థితి నెలకొంది. అసభ్య ప్రవర్తన కింద ఆమెను అరెస్ట్ చేసి, మానసిక వైద్యులచే కౌన్సిలింగ్ ఇప్పించాలని హేతువాద సంఘాల నేతలే కాదు, పలు గ్రామాల ప్రజలు సైతం డిమాండ్ చేస్తున్నారు. ఆమె అసభ్య ప్రవర్తనపై విసుగు వస్తే ఏదో ఒక ప్రాంతంలో జనం తిరుగుబాటు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి మొన్న వరంగల్ జిల్లాలో జరిగిన సంఘటనే దీనికి ఉదాహరణగా చూపుతున్నారు. ఆ సంఘటనను ఒకసారి పరిశీలిస్తే ఇలా ఉంది. గత వారం వేముల వాడలో భక్తులపై దాడికి ప్రయత్నించిన అనంతరం ఆమె వరంగల్ జిల్లా కొమ్మాల గ్రామంలో ప్రత్యక్షమైంది. కారు దిగగానే స్థానికులు చుట్టూ ముట్టగా, ఓ వ్యక్తి అఘోరివైన నువ్వు 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళకు వెళ్లకుండా ఇక్కడ ఏం చేస్తున్నావని నిలదీయడంతో అఘోరి అతడిపై దాడికి చేయడానికి ప్రయత్నించింది. తను చెప్పేది వినకపోయినా, అడ్డుకున్నా సరే పెట్రోలు పోసుకుంటా అని పెట్రోలు చూపుతూ బెదిరింపునకు దిగింది. దీనికి గ్రామస్తులు ఎంత మాత్రం బెదరకపోగా, పెట్రోలు పోసుకో అంటూ మరింత రెచ్చగొట్టారు. ఒక విధంగా చెప్పాలంటే పెట్రోలు పోసుకుంటావా లేదా అంటూ నిలదీశారు. దీంతో, చేసేది లేక అఘోరీ రూపంలో ఉన్న ఆమె కారు ఎక్కి పలాయనం చిత్తగించంది. ఇదే తరహాలో ఆమె గతంలో విజయవాడ వద్ద కూడా పెట్రోలు పోసుకొని పోలీసులను బెదిరించింది. అప్పుడు కూడా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకోక పోవడం గమనార్హం. ఇక సోమవారం నాడు వేములవాడలో దర్గా కూల్చివేస్తా అంటూ బయలు దేరిన ఈ మానసిక రోగిని సిరిసిల్ల జిల్లా తంగళ్ల పల్లి సమీపంలోని చెక్ పోస్టు వద్ద అదుపులోకి తీసుకున్నారు.

mental in
నగ్నంగా ఓ స్మశానంలో

ప్రతీ హిందువులో ఏదోఒక రూపంలో దాగి ఉన్న ధర్మ సిద్ధాంతాన్ని కొత్త కోణంలో ప్రేరేపించి పబ్బం గడుపు కోవడానికి కొన్ని శక్తులు వ్యూహ రచన చేస్తున్నాయి. అందుకే “ఆధునిక” సమాజాన్ని కాస్తా “ఆటవిక” సమాజంగా వెనక్కి లాగే కుతంత్రాలు ఊపందుకున్నాయి.అధికారమే లక్ష్యంగా “ధర్మం” ముసుగులో మున్నెన్నడూ లేని  విధంగా దిగంబరులను జనం మధ్యకు పురిగోల్పడం అత్యంత దుర్మార్గం.  నైతిక విలువలు లేని కొన్ని సామాజిక మాధ్యమాలు తమ ప్రాపకం కోసం ఇలాంటి  “మానసిక” వికలాంగులను సైతం ప్రచారానికి వాడుకోవడం నిజంగా దౌర్భాగ్యం. మహిళ అఘోరీని అదుపుచేయక పోతే ఏదోఒక రోజు తెలుగు రాష్ట్రాల్లో శాంతి, భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం లేకపోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *