తెలంగాణ అంటే నేనే అంటూ విర్రవీగిన నాయకులు కెసిఆర్.. ఇరవై నాలుగేళ్ల పాలనలో మితిమీరిన విశ్వాసం ఒరిస్సా నేత నవీన్ పట్నాయక్ సొంతం.. కేవలం మరాఠీ భావజాలంతో రాజకీయ వ్యూహ రచనలు లేని మరో నేత ఉద్ధవ్ ఠాక్రే. అవినీతిని ఊడ్చి వేస్తామంటూ పదేళ్లు దేశ రాజధానిని ఏలి, “చీపురు కట్టను కవిత మద్యం”లో కలిపిన కేజ్రీవాల్… నా మాటే వేదం అంటూ ఆంధ్రప్రదేశ్ లో పాలనను గాడి తప్పించిన మహానేత తనయుడు జగన్ మోహన్ రెడ్డి… ఏడాది కాలంలో ఒకరొక్కరు అధికార పీఠాన్ని కోల్పోయారు. ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే ఆయా నేతలతో కెసిఆర్ కి మంచి అనుబంధం ఉండడం. ప్రస్తుత ఈ నలుగురు ఊహించని స్థాయిలో ప్రజా వ్యతిరేకతకు గురయ్యారు.
“సారు”తో నలుగురు…!
