IMG 20230920 WA0017

జగన్ కి జ్వరం…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి జ్వరం వచ్చింది. ఆయనకు వైరల్ ఫీవర్ సోకడంతో బలహీనంగా ఉన్నారు. కేబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.తర్వాత కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్నారు. అయితే, మధ్యాహ్నం తర్వాత సీఎం జగన్ ను కలిసేందుకు ఇచ్చిన అన్ని అపాయింట్లను రద్దు చేశారు. జలుబు, దగ్గు కూడా ఉండటంతో వైరల్ ఫీవర్ గా గుర్తించారు. 22 నుంచి జరగబోయే శాసనసభ సమావేశాలు ప్రభుత్వానికి అత్యంత కీలకం.

Read Full News
exclusive

మళ్లీ మొదలవుతోందా….!

రాజకీయ, సామజిక  ఉద్యమాలకు పురుటి గడ్డగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు మళ్లీ జడలు విప్పుతున్నాయా? కమ్మ, కాపు, రెడ్డి అంటూ ఆధిపత్య పోరుకు ఆయా వర్గాలు కోరలు చాస్తున్నాయా? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రలో  సర్దుమణిగాయనుకున్న కులాల కక్షలు తిరిగి పెట్రేగుతున్నాయా? మూడు, నలుగు దశాబ్దాల నాటి మాదిరిగా పగలు, ప్రతీకారాలు కారాలు, మిర్యాలు దంచుతున్నాయా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ సామాన్యుని మదిని  తొలుస్తున్నాయి. గత పక్షం రోజులుగా ఆంధ్ర…

Read Full News
babu

కొంత ఊరట…

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కి ఏపి హై కోర్టులో కొంత ఉరట కనిపించింది.చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఆయన్ని ఈ నెల 18 వ తేదీ వరకు కస్టడీకి తీసుకోవద్దని సీఐడీని ఆదేశిందింది. అదేవిధంగా చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ కూడా ఈనెల 19కి వాయిదా వేసింది. తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను…

Read Full News
IMG 20230817 WA0033

బస్సులో “బాబు”…

ఆంధ్ర ప్రదేశ్ కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరులో భవిష్యత్ కు గ్యారెంటీ ప్రచార కార్యక్రమంలో భాగంగా బస్సులో ప్రయాణించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మహిళలతో మాట్లాడారు. నిత్యావసర వస్తువుల ధరలు, ప్రభుత్వ పన్నుల పై మహిళలు తమ అవేదన వ్యక్తం చేశారు. మహిళలకు టీడీపీ ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం పై హర్షం వ్యక్తం చేశారు.

Read Full News
Screenshot 20230817 170851 WhatsApp

పోటెత్తిన “పోర్టు”…

విశాఖ గంగవరం పోర్టు వద్ద కార్మికులు చేపట్టిన ‘పోర్టు బంద్’ ఉద్రిక్తతకు దారి తీసింది. తొలగించిన పోర్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు కనీస వేతనం రూ.36 వేలు చెల్లించాలనే డిమాండ్లతో కార్మిక సంఘాలు బంద్ కి పిలుపు నిచ్చాయి. ఈ మేరకు గురువారం ఉదయం  కార్మికులు, నిర్వాసితులు, కాలుష్య ప్రభావిత ప్రాంతాల ప్రజలు, అఖిలపక్ష నేతలు పెద్ద ఎత్తున గంగవరం పోర్టు వద్దకు చేరుకున్నారు.  కార్మికుల బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. పోర్టు…

Read Full News