ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కి ఏపి హై కోర్టులో కొంత ఉరట కనిపించింది.చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఆయన్ని ఈ నెల 18 వ తేదీ వరకు కస్టడీకి తీసుకోవద్దని సీఐడీని ఆదేశిందింది. అదేవిధంగా చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ కూడా ఈనెల 19కి వాయిదా వేసింది. తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దుచేయాలని చంద్రబాబు వేసిన వ్యాజ్యంపై కౌంటర్ దాఖలు చేయాలని సిఐడి కి సూచిస్తూ దీనిపై విచారణను కూడా 19 వ తేదీకి వాయిదా వేసింది.