నన్ను అరెస్టు చేయొచ్చు..
తనను ఒకటి, రెండు రోజుల్లో అరెస్ట్ చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. నిప్పులా బతికిన తనపైనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఐటీ నోటీసులపై అయన పరోక్షంగా స్పందించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గంలో వివిధ వర్గాల ప్రజలతో నిర్వహించిన ప్రజా వేదిక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో విధ్వంస పాలన సాగిస్తోందని మండిపడ్డారు. జగన్…
