ఏ1 గా చంద్రబాబు.. - EAGLE NEWS

ఏ1 గా చంద్రబాబు..

babu 1

పుంగనూరు అల్లర్ల కేసులో చంద్రబాబుపై ఎఫ్.ఐ.అర్. నమోదైంది. ఈ నెల 4న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన “యుద్ధభేరి” పర్యటనలో చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన అల్లర్లకు సంబంధించి పోలీసులు తాజాగా మరో రెండు కేసులు నమోదు చేశారు. అన్నమయ్య జిల్లా ముదివీడు పీఎస్‌లో ఏ1 గా చంద్రబాబు, ఏ 2గా దేవినేని ఉమ, ఏ3గా అమర్నాథ్‌రెడ్డి పేర్లతో ఎఫ్.ఐ.అర్. నమోడు చేసినట్టు పోలీసులు తెలుపారు. ఇదిలా ఉంటే, అల్లర్లకు పాల్పడ్డారంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్ లలో మొత్తం 7 కేసులు నమోదు చేసి 246 మందిని రిమాండ్ కు పంపారు. చిత్తూరు సిసిఎస్ కానిస్టేబుల్ ఆర్. లోకేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుంగనూరు టిడిపి ఇంచార్జ్ చల్లా బాబు తోపాటు చౌడేపల్లి, పులిచెర్ల మండలాలు తోపాటు అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన 47 మంది టిడిపి శ్రేణులపై కేసులు నమోదు చేశారు. అనంతపురానికి చెందిన మరో ఏఆర్ కానిస్టేబుల్ రణధీర్ ఫిర్యాదు మేరకు చల్లా బాబు సహా చిత్తూరు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజవర్గానికి సంబంధించిన 39 మంది పై కేసులు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *