నన్ను అరెస్టు చేయొచ్చు.. - EAGLE NEWS

నన్ను అరెస్టు చేయొచ్చు..

babu 2

తనను ఒకటి, రెండు రోజుల్లో అరెస్ట్ చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. నిప్పులా బతికిన తనపైనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఐటీ నోటీసులపై అయన పరోక్షంగా స్పందించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గంలో వివిధ వర్గాల ప్రజలతో నిర్వహించిన ప్రజా వేదిక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో విధ్వంస పాలన సాగిస్తోందని మండిపడ్డారు. జగన్ అరాచక పాలనను అంతమెుందించేందుకు ఇంటికొకరు చొప్పున ముందుకు రావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఒకటి, రెండు రోజుల్లో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అంతేకాకుండా తనపై కూడా దాడి చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా ఎలాంటి దాడులకు పాల్పడినా వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని చంద్రబాబు నాయుడు అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకొచ్చారు. తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మహాభారతం,రామాయణంలో ధర్మం గెలిచినట్టు చివరకు తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పాలనపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *