IMG 20240803 WA0012

ఇళ్ళు లేని “భవన నిర్మాతలు”

భవన నిర్మాణ కార్మికులకు సొంతింటి కల నెరవేర్చాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ డిమాండ్ చేశారు. పూరి గుడిసె నుంచి భారత పార్లమెంటు వరకు నిర్మించే ఈ వర్గానికి సొంత ఇల్లు లేక పోతే ఇక కాంగ్రెస్ ప్రజా పాలనకు అర్థం ఏమిటని ఆయన ప్రశ్నించారు. హైదరాబాదు మెట్టు గూడ లోని జై స్వరాజ్ పార్టీ కార్యాలయంలో జరిగిన జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్య అతిథిగా కేఎస్ఆర్ గౌడ…

Read More
pv jaiswrj

స్ఫూర్తీ దాత ..

సంస్కరణల ద్వారా దేశ ప్రజలకు ఆర్థిక ఫలాలు అందించాలనే లక్ష్యంతో పీ వీ నర్సింహా రావు సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకుని వచ్చారని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ పేర్కొన్నారు. పీవీని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలు లేని సమాజ నిర్మాణం కోసం పథకాలు చేపట్టాలని ఆయన సూచించారు. భారత రత్న మాజీ ప్రధాన మంత్రి, స్వర్గీయ గౌరవ పి. వి. నరసింహ రావు 103 వ…

Read More
jai labr c

“అసంఘటిత” పని కావాలి…!

అసంఘటిత కార్మికులకు నెలకు పది రోజులకు తగ్గకుండా పని దినాలు కల్పించాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావుగౌడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని లేబర్ కమిషనర్ ను జై స్వరాజ్ పార్టీ కార్మిక విభాగం, పెయింటర్స్ సంఘాల నాయకులతో కలిసి వినతి పత్రం ఇచ్చింది. కమిషనర్ తరుఫున జాయింట్ కమిషనర్ వినతి పత్రాన్ని తీసుకున్నారు. తెలంగాణలో పేదలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం తన విధానాలను రూపొందించాలి. అసంఘటిత కార్మికులు అనేక…

Read More
IMG 20240617 WA0021

పది రోజుల పని కావాలి..

తెలంగాణలో పేదలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం తన విధానాలను రూపొందించాలని, అసంఘటిత కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారికి ప్రభుత్వం తరఫున గుర్తింపు కార్డులు ఇచ్చి, గుర్తింపు కార్డులు తీసుకున్న ప్రతి కార్మికునికి నెలకు పది రోజుల పని దినాలకు తగ్గకుండా రోజు వేతనంతో కూడిన పని కల్పించాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ డిమాండ్ చేశారు. హైదారాబాద్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన జై స్వరాజ్ పార్టీ కార్మిక…

Read More
IMG 20240610 WA0003

పోరుకు “జై స్వరాజ్”

తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటాలకు జై స్వరాజ్ సిద్ధం అవుతోందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ వచ్చి పదేళ్ళు దాటినా నేటికీ మౌలిక సదుపాయాలైన విద్య, వైద్యం, ఉపాధి ప్రజలకు అందించే కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టలేదని ఆయన అన్నారు. ఇన్నాళ్లు టీఆర్ఎస్ మాయమాటలతో కాలయాపన చేస్తే, పచ్చి అబద్ధాలతో వచ్చే ఐదేళ్లు వెళ్లబుచ్చే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు కనిపిస్తోందని కేఎస్ఆర్ గౌడ్ వివరించారు. హైదరాబాద్ లో జరిగిన పార్టీ…

Read More
swaraj

ముమ్మర ప్రచారం..

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రతిష్టాత్మకమైన చేవెళ్ల పా నియోజకవర్గ పరిధిలో జై స్వరాజ్ పార్టీ అభ్యర్థి సుగురు శ్రీనివాస్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆయన వారం రోజులుగా పార్టీ కార్యకర్తలతో ప్రచార రథం పై గ్రామ గ్రామం తిరుగుతూ ఓట్లు అభ్యర్ధిస్తున్నారు. జై స్వరాజ్ పార్టీ ఆశయాలను, లక్ష్యాన్ని ప్రజలకు వువరిస్తున్నారు. పెన్ను గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు.

Read More
tdp logo 1

“దేశం”పయనం ఎటు…!

నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న తెలుగదేశం పార్టీ ఎవరూ ఊహించని రీతిలో తొలిసారి ఎన్నికల బరికి దూరమైంది. వచ్చే నెలలో జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీకి మొహం చాటేయడంతో రాజకీయ పరిశీలకులు సహా సామాన్య జనం ఒక్కసారిగా విస్తుపోయారు. తెలంగాణలోని అనేక జిల్లాల్లో అంకితభావంతో పనిచేస్తున్న క్యాడర్,  కొన్నినియోజక వర్గాల్లో ఇప్పటికీ పట్టు సడలని ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ తెలుగుదేశం పోటీకి దూరం కావడం ఆ పార్టీ మనుగడను మరింత దెబ్బతీసే అవకాశం…

Read More
IMG 20231007 WA0049 scaled

ప్రమిదల వెలుగులో…

అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ తెలుగు రాష్ట్రాల్లో ‘‘కాంతితో క్రాంతి’’ కార్యక్రమాన్ని చేపట్టింది. వివిధ జిల్లాల్లో పలువురు సంఘీభావం తెలిపారు. రాజమండ్రి లో నిర్వహించిన కార్యక్రమంలో నారా భువనేశ్వరి ప్రమిదలు వెలిగించి నిరసన లో పాల్గొన్నారు. ఆమెతో పాటు స్థానిక మహిళలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము సైతం బాబు కోసం, బాబుతో మేము అంటూ మహిళలు నినాదాలు చేశారు. తెలంగాణలో టిడిపి శ్రేణులు, సినీ దర్శకులు రాఘవేంద్ర రావు, నందమూరి రామకృష్ణ…

Read More