“అసంఘటిత” పని కావాలి…!

jai labr c

అసంఘటిత కార్మికులకు నెలకు పది రోజులకు తగ్గకుండా పని దినాలు కల్పించాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావుగౌడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని లేబర్ కమిషనర్ ను జై స్వరాజ్ పార్టీ కార్మిక విభాగం, పెయింటర్స్ సంఘాల నాయకులతో కలిసి వినతి పత్రం ఇచ్చింది. కమిషనర్ తరుఫున జాయింట్ కమిషనర్ వినతి పత్రాన్ని తీసుకున్నారు. తెలంగాణలో పేదలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం తన విధానాలను రూపొందించాలి. అసంఘటిత కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారికి ప్రభుత్వం తరఫున గుర్తింపు కార్డులు జారీ చేసి, ప్రతి కార్మికునికి నెలకు పది రోజుల పని దినాలకు తగ్గకుండా వేతనంతో కూడిన పని కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

jai labr

తెలంగాణ రాష్ట్రంలో సుమారు కోటి మందికి పైగా అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది రోజు కూలీలే. పని దొరికితే పండగ లేక పోతే ఎండుడే అన్నట్లుగా వారి జీవితాలు ఉన్నాయి. నెలలో పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల పని దొరికితే మహా గగనంగా ఉంది. వచ్చిన కూలితో ఇంటి కిరాయి, కుటుంబ పోషణకే సరిపోవడం లేదు. ఇక పిల్లల చదువులు, అనారోగ్య సమస్యల వంటివి అదనం. వీటికి తోడు వలస కార్మికుల పోటీ ఉంది. దీంతో పని దినాలు తగ్గుతున్నాయని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. జై స్వరాజ్ పార్టీ పేదలు లేని తెలంగాణ ఏర్పడాలని కోరుకుంటూ పోరాటాలకు శ్రీకారం చుట్టిందని, అందుకు ముందుగా అసంఘటిత కార్మికులు, వ్యవసాయ కూలీలకు ఉపాధి అవకాశాలు మెరుగు పరచడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కాసాని పేర్కొన్నారు. దీని కోసం జై స్వరాజ్ పార్టీ అసంఘటిత కార్మికులకు ప్రతి నెలా పది రోజుల కనీస పని దినాలు కల్పించాలని డిమాండ్ చేస్తోందని వివరించారు. ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో స్థానికులకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కాసాని కోరారు. లేబర్ కమిషనర్ ను కార్మిక విభాగం అధ్యక్షుడు గోలుకొండ రత్నం, జై స్వరాజ్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి యామిని లక్ష్మీ, పెయింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గూడెం బిక్షపతి, కోశాధికారి ఇందిరాల సత్యనారాయణ, నల్ల దయాకర్, తప్పట్ల ఏలియా, గోలుకొండ లక్ష్మీ నారాయణ, ఎ. నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

2 thoughts on ““అసంఘటిత” పని కావాలి…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *