స్ఫూర్తీ దాత ..

pv jaiswrj

సంస్కరణల ద్వారా దేశ ప్రజలకు ఆర్థిక ఫలాలు అందించాలనే లక్ష్యంతో పీ వీ నర్సింహా రావు సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకుని వచ్చారని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ పేర్కొన్నారు. పీవీని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలు లేని సమాజ నిర్మాణం కోసం పథకాలు చేపట్టాలని ఆయన సూచించారు. భారత రత్న మాజీ ప్రధాన మంత్రి, స్వర్గీయ గౌరవ పి. వి. నరసింహ రావు 103 వ జయంతి సందర్బంగా ఘనంగా నివాళులు అర్పించిన జై స్వరాజ్ పార్టీ జాతీయ అధ్యక్షులు కాసాని శ్రీనివాసరావు గౌడ, జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ రత్నం, జాతీయ అధికార ప్రతినిధి కుమారి యామిని లక్ష్మి, జేఎస్టీయూసీ కార్యదర్శులు సుగురు శ్రీనివాస్, మాటూరి కృష్ణ మోహన్, లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *