IMG 20240620 WA0021

కొత్త డిజిపి…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ ఆదేశాలు జారీ చేశారు. 1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ కి చెందిన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్‌ అధికారుల సీనియార్టీ లిస్ట్‌లో టాప్‌లో ఉన్నారు. తిరుమలరావు గుంటూరుకి చెందిన వారు. దేవాపురంలో సామాన్య కుటుంబంలో జన్మించారు. తండ్రి ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ విభాగంలో అధికారిగా పని చేశారు. ఆయనకు తిరుమలరావు సహా ఇద్దరు కుమారులు, ఐదుగురు…

Read More
babu pwn kodi

పందెం “కోళ్ళు”…

ఆంధ్రప్రదేశ్ లోని మందడం గ్రామంలో జరిగిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని సందడి చేశారు. గంగిరెద్దు కళ్ళాలు పట్టుకొని పవన్ “డూ…డూ…బసవన్న”అనగా ఆ పక్కనే చంద్రబాబు నాయుడు విజయం మనదే అన్నట్టు సంకేతం చూపడం ఆకర్షణగా నిలిచింది.

Read More
wethr

అతలాకుతలం…!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ మిచౌంగ్  తుపాను ఆంధ్రప్రదేశ్ లోని పలుజిల్లాలను అతలాకుతలం చేస్తోంది. వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలు, ఈదురు గాలులు జన జీవనాన్ని స్తంభిపజేశాయి. తుపాను ప్రభావం వల్ల ఉభయగోదావరి, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక పట్టణాలు, గ్రామాలు జలమయం అయ్యాయి. తాజా సమాచారం మేరకు  నెల్లూరుకు 50 కి.మీ, బాపట్లకు 110 కి.మీ, మచిలీపట్నానికి 170కి.మీ. దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ శాఖ…

Read More
nagavani

నో ఛాన్స్…

ఆంధ్రప్రదేశ్ లోని పాలిటెక్నిక్ కళాశాలల్లో డిఫార్మసీ కోర్సుకు సంబంధించిన ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూలు ముగిసిందని, మొత్తం 48 కళాశాలల్లో 3044 సీట్లు ఉండగా, 531 సీట్లు భర్తీ చేసామని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, ప్రవేశాల కన్వీనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఇంటర్మీడియట్ అర్హతతో పాలిటెక్నిక్ కళాశాలల్లో రెండు సంవత్సరాల డిప్లమో ఇన్ ఫార్మసీ అడ్మిషన్ల కోసం నిర్దేశించగా, సీట్ల కేటాయింపు వివరాలను సోమవారం విడుదల చేసారు. 9 ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో 506 సీట్లు ఉండగా…

Read More
IMG 20230920 WA0017

జగన్ కి జ్వరం…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి జ్వరం వచ్చింది. ఆయనకు వైరల్ ఫీవర్ సోకడంతో బలహీనంగా ఉన్నారు. కేబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.తర్వాత కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్నారు. అయితే, మధ్యాహ్నం తర్వాత సీఎం జగన్ ను కలిసేందుకు ఇచ్చిన అన్ని అపాయింట్లను రద్దు చేశారు. జలుబు, దగ్గు కూడా ఉండటంతో వైరల్ ఫీవర్ గా గుర్తించారు. 22 నుంచి జరగబోయే శాసనసభ సమావేశాలు ప్రభుత్వానికి అత్యంత కీలకం.

Read More
exclusive

మళ్లీ మొదలవుతోందా….!

రాజకీయ, సామజిక  ఉద్యమాలకు పురుటి గడ్డగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు మళ్లీ జడలు విప్పుతున్నాయా? కమ్మ, కాపు, రెడ్డి అంటూ ఆధిపత్య పోరుకు ఆయా వర్గాలు కోరలు చాస్తున్నాయా? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రలో  సర్దుమణిగాయనుకున్న కులాల కక్షలు తిరిగి పెట్రేగుతున్నాయా? మూడు, నలుగు దశాబ్దాల నాటి మాదిరిగా పగలు, ప్రతీకారాలు కారాలు, మిర్యాలు దంచుతున్నాయా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ సామాన్యుని మదిని  తొలుస్తున్నాయి. గత పక్షం రోజులుగా ఆంధ్ర…

Read More
babu

కొంత ఊరట…

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కి ఏపి హై కోర్టులో కొంత ఉరట కనిపించింది.చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఆయన్ని ఈ నెల 18 వ తేదీ వరకు కస్టడీకి తీసుకోవద్దని సీఐడీని ఆదేశిందింది. అదేవిధంగా చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ కూడా ఈనెల 19కి వాయిదా వేసింది. తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను…

Read More