దౌత్య విజయం..
ప్రధాని మోడీ రష్యా పర్యటనలో తొలిరోజు భారత్కు భారీ దౌత్య విజయం లభించింది. రష్యా సైన్యంలో పని చేస్తున్న భారతీయులను విడుదల చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమ్మతించారు. వెంటనే వారిని ఆర్మీ విధులకు వెనక్కి రప్పిస్తామని, స్వదేశానికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తామని ఒప్పుకున్నారు.ఈ మేరకు ప్రధాని మోదీకి ఇచ్చిన ప్రైవేట్ విందులో పుతిన్ మాట ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.