ఎవడబ్బ సొమ్ము…!

dopidi c

తెలంగాణలో మునుపెన్నడు లేని విధంగా రాజకీయ నాయకులు మారి పోయారు. ఒకప్పుడు అనేక మంది ప్రజా సేవ కోసం మాత్రమే రాజకీయాల్లోకి వచ్చారు.  సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపట్టి మహా నేతలుగా ప్రజల గుండెల్లో  గూడు కట్టుకున్నారు. అలాంటి వారిలో  ఎన్.టి. రామారావు, రాజశేఖర్ రెడ్డి వంటి వారు ఈ తరం వారికి ఒక ఉదాహరణ. గతంలో రాజకీయంగా, అధికారికంగా అత్యున్నత పదవులు అనుభవించి కూడా చివరి రోజుల్లో నయా పైసా లేకుండా  తనువు చాలించిన నేతలనూ చూశాం. రెండు దశాబ్ధాల కిందటి వరకు కూడా  రాజకీయ నేతల్లో ఎంతోకొంత నిజాయితీ, నిబద్దత కనిపించేది.  కానీ, రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత పాలకుల అవినీతికి అడ్డు లేకుండా పోయింది. ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీలు బలంగా లేకపోవడమే కాదు, ఆ పార్టీల నేతల చరిత్ర కూడా అవినీతి, నేరమయం కావడం  కూడా ప్రజలకు శాపంగా మారింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే ప్రజలు ఏ స్థాయిలో మోసపోతున్నారో స్పష్టం అవుతుంది. ఉద్యమ పార్టీగా చెప్పుకుంటున్న భారత రాష్ట్ర సమితి, ప్రజా పాలన అంటూ బింకం కొడుతున్న కాంగ్రెస్ పార్టీల నేతలు ఈ ప్రత్యేక రాష్ట్రంలో సొంత ఖజానా నింపుకుంటున్నట్టు బలమైన వాదనలు రోడ్డున పడడం అత్యంత దారుణమైన అంశం. ఒక విధంగా చెప్పాలంటే పాలకులకు తెలంగాణ గడ్డ దోపిడీకి అడ్డాగా నిలిచింది. మంచినీళ్ళ నుంచి మద్యం వరకు ఒక పార్టీ దోచుకుంటే, పధకాలు, ప్రజా పాలన అనే ఖరీదైన మాటల ముసుగేసి మరోపార్టీ దోపిడీకి పాల్పడుతున్నట్టు రచ్చబండ చర్చలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కార పథకాలపై కంటే అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల ఆస్తుల విలువల లెక్కింపు వ్యవహారమే ప్రధాన ఎజెండాగా కనిపిస్తోంది. కొద్ది రోజులుగా రాజుకుంటున్న నేతల ఆస్తిపాస్తుల రాద్దాంతరం పై “ఈగల్ న్యూస్” దృష్టి సారించింది. ఆ సమీక్ష మీ కోసం.

తెలంగాణా బిడ్డలు దశాబ్దాలుగా పోరాడి  ప్రత్యేక రాష్ట్రాన్ని సాధింసుకొని బంగారు భవిష్యత్తు కోసం వేచి చూస్తున్నారు. ఉద్యమ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్ళ కాలం పాటు ఎవరికీ ఎలాంటి ప్రయోజనం లభించిదనేది అందరికీ తెలిసిన విషయమే. కెసిఆర్ పాలనలో ఆయన కుమార్తె లిక్కర్ కేసులో తిహార్ జైలు పాలు కావడం, కాళేశ్వరం, కార్ల రేస్, దొంగ పోలీసు ముఠా (ఎస్.ఐ.బి) వంటి  వ్యవహారాల్లో కెసిఆర్, కేటిఅర్ ఆరోపణలు ఎదుర్కోవడం బహిరంగ రహస్యమే. అధికారం, ఆస్తుల తగాదాలు చివరకు కవితను పుట్టింటికి దూరం చేశాయి. అంతేకాదు, అన్నా, చెల్లెళ్ళు సైతం బద్ద శత్రువులుగా మారారు. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన కెసిఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే పరిమైతమైయారు.

dopidi in 768x432 1

ఇదంతా ఒక ఎత్తైతే ప్రస్తుతం జగురుతున్న తంతు వేరుగా ఉంది. రేవంత్ పాలన గాడి తప్పిందని భారాస నినదిస్తోంది. కాదు, కాదూ.. ప్రజా పాలనను చూసి ఓర్వలేక గులాబి నేతలకు కన్ను కుడుతోందని కాంగ్రెస్ వాదిస్తోంది. కొద్ది రోజులుగా ఈ వాదనలు ముదిరి పాకాన పడ్డాయి. ప్రజల కోసం వేయాల్సిన రాజకీయ ఎత్తుగడలను తుంగలో తొక్కి రెండు పార్టీల నేతలు అధికారాన్ని అడ్డు పెట్టుకొని గతంలో ఎవరు ఎంతెంత  దోచుకున్నారో, ప్రస్తుతం ఎలా దోచుకుంటున్నారో అనే లెక్కలు తేల్చుకునే పనిలో పడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్, భారాస అగ్రనేతలు “అడిటర్ల” మాదిరిగా మారి పోయారు. పదేళ్ళ పాలనలో జనానికి అరచేతిలో స్వర్గం చూపించి ప్రజాధనం, ప్రభుత్వ డబ్బుని క్విడ్ ప్రో కో (నీకు అది – నాకు ఇది) దారిలో కెసిఆర్, కేటిఅర్ లు వేలు, లక్షల కోట్లు కూడబెట్టుకున్నారనేది కాంగ్రెస్ నేతల ఆరోపణ. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కేటిఅర్ ఆస్తుల చిట్టా విప్పే పనిలో ఉండడం ఆసక్తికర విషయం. మఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి  ఆరోపణలు చేస్తున్నారంటే అవి నూరు శాతం వాస్తవమని నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తాజా ఉదాహరణ కేటిఅర్ హోటళ్ళ ముచ్చట. కేటిఅర్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని హైదరాబాద్ హై టెక్ సిటి, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఖరీదైన హోటళ్లకు యజమానిగా మారారని రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణ, వాస్తవం అనే విషయం గమనార్హం. ఈ ప్రాంతాల్లో రెండు డెక్కన్ హోటళ్ళు ఉన్న సంగతి ప్రజలకు తెసులు గానీ, అవి కేటిఅర్ అనుయాయులవనే రహస్యం అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. రేవంత్ రెడ్డి ఆరోపణను కేటిఅర్ స్వికరించడం  మరోవిశేషం. ఆ హోటళ్ళు తనవే అంటూ కేటిఅర్ స్వయంగా తేల్చి చెప్పారు. రెండు కాదు మూడు హోటళ్ళు అంటూ, రేవంత్ తన హోటళ్ళ పై ఉచిత ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించిన  విషయం  అందరికీ తెలిసిందే. 

ఇదిలా ఉంటే , భారాస నేతలు రేవంత్ రెడ్డిని విడిచి పెట్టలేదు. కేటిఅర్ సహా కొందరు నేతలు రేవంత్ ఆస్తుల లెక్కల రెక్కలు విరిచే పనిలో మునిగిపోయారు.  అధికారాన్ని అడ్డుపెట్టుకొని రేవంత్, ఆయన సోదరులు దందాలకు పాల్పడుతున్నారని ఘాటైన ఆరోపణలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే కొంపల్లి ప్రాంతంలో నిర్మిస్తున్న ఒక పాథశాల రేవంత్ రెడ్డి భార్యకు చెందినదే  అంటూ మీడియాకు వివరాలు వెల్లడించారు. అంతేకాదు, ముఖ్యమంత్రి  సోదరులు అధికారులను అడ్డుపెట్టుకొని అనేక మార్గాల్లో కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని  ఉదాహరణలతో సహా భారాస శ్రేణులు రేవంత్ ని, కాంగ్రెస్ పాలనను ఎండగడుతున్నాయి. అంతేకాదు, రేవంత్ బినామిలు కుప్పలు తెప్పలుగా పుట్టుకువస్తున్నారని ఆరోపిస్తూ ఆసుపత్రి, నిర్మాణ, మీడియా సంస్థల పేర్లను జనంలోకి వదిలారు. అందులో సికింద్రాబాద్ సంగీత్ సెంటర్ లో కొత్తగా ఏర్పాటు చేసిన కార్పోరేట్  ఆసుపత్రి రేవంత్ అల్లుడికి చెందినదిగా ప్రచారం మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *