నేనింతే.. నా ఇష్టం..!

monstr no ani C

పశ్చిమ ఆసియాలో ఇరాన్ పై ముప్పేట దాడులకు పాల్పడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మొన్న టెక్ దిగ్గజాల సమావేశంలో జారిన మాట ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.  ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఎ. ఐ.) పై వైట్ హౌస్ లో సాఫ్ట్ వేర్ కంపెనీల ముఖ్యులతో సమావేశం జరిగింది. ఎ.ఐ.  భద్రత, డేటా సెంటర్లు, కంప్యూటింగ్‌ మౌలిక వసతులపై చర్చించారు.  అనంతరం ట్రంప్ విలేకర్లతో మాట్లాడుతున్న సమయంలో  గూగుల్ సి.ఇ. ఒ. సుందర్ పిచాయ్‌ ని “మాన్ స్టర్“ (రాక్షసుడు) అంటూ వ్యాఖ్యానించారు. పిచాయ్‌ గూగుల్ సంస్థకు నాయకత్వం వహిస్తున్నప్పటికీ బహిరంగంగా ఆయన తక్కువగా కనిపిస్తారంటూ ఆయన్ని “మాన్ స్టర్ “గా అభివర్ణించారు. సుందర్ పిచాయ్‌ సైతం ట్రంప్ మాటలను చిరునవ్వుతో స్వీకరించారు.

ట్రంప్ మాటలు అప్పటి వరకు సరదాగానే ఉన్నా సామాజిక, రాజకీయ విశ్లేషకులు మాత్రం ఆలోచనల్లో పడ్డారు. అనాలోచితంగా ఇరాన్ పై కయ్యానికి కాలు దువ్విన ట్రంప్ ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో మాత్రమే కాక ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల అనిచ్చితికి కారకులు అయ్యారని పేర్కొంటున్నారు. ఇరాన్ యుద్ధంపై రోజుకో మాట మారుస్తూ, హొర్ముజ్ జలసంధికి తన పేరు పెట్టమంతున్న ట్రంప్ గూగుల్ సి. ఇ. ఒ. ని “మాన్ స్టర్ “ అనడం ఆశ్చయంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుత తరుణంలో “మాన్ స్టర్ “ అనే పదం సరిపోతుందో పునరాలోచించుకోవాలని బేధావి వర్గం ట్రంప్ కి సూచిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *