stones on ghat road - EAGLE NEWS
DURGA

జారిపడ్డ రాళ్లు…

విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి కొలువై ఉన్న ఇంద్రకీలాద్రిపై కొండరాళ్లు జారి పడడం ఆందోళనకు గురి చేసింది. ఎడతెరిపి లేకుండా వర్షం వల్ల రాళ్ళ చుట్టు ఉండే మట్టి కొట్టుకుపోయి రాళ్ళు ఘాట్‌ రోడ్‌ మీద పడ్డాయి. దీంతో అప్రమత్తమైన దేవస్థానం అధికారులు వెంటనే ఆ మార్గంలోని టోల్‌గేట్‌ను మూసివేశారు. భక్తులను మల్లికార్జున మహా మండపం మెట్ల మార్గం వైపు మళ్లించారు. ఇంజనీరింగ్‌ అధికారులు, సిబ్బంది ఘాట్ రోడ్డులో పడిపోయిన రాళ్లను యుద్ధప్రాతిపదికన తొలగించారు.

Read More