mayawati

బడుగుల కలలు సాకారం కావాలి…

అంబేడ్కర్‌, కాన్షీరామ్‌ కలలను మనం సాకారం చేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి పిలుపునిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా సూర్యాపేటలో నిర్వహించిన ప్రచార సభలో మాయావతి పాల్గొని ప్రసంగించారు. యూపీ తరహాలో తెలంగాణలోనూ బీఎస్పీని ఆదరించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కొన్ని పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటించినా వాటిని అమలు చేయట్లేదన్నారు. బీఎస్పీని గెలిపిస్తే ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు….

Read Full News