IMG 20240905 WA0018

“నడక” పెంచిన టిటిడి..

తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి నడకదారిలో వెళ్లే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. నడకదారి భక్తులకు 10 వేల టికెట్లు జారీ చేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. తిరుమలకు శ్రీవారి మెట్లు, అలిపిరి మార్గాల ద్వారా చేరుకుంటారు. ఇప్పటికే శ్రీవారి మెట్టు మార్గం ద్వారా నడిచి వెళ్లే భక్తులకు ప్రతి రోజూ 3 వేల టికెట్లను జారీ చేస్తున్నారు.ప్రస్తుతం ఆ సంఖ్యను పెంచడం విశేషం. శ్రీవారి మెట్టుమార్గంలో 4 వేలు, అలిపిరి మార్గం ద్వారా వెళ్లే నడకదారి భక్తులకు…

Read More
IMG 20240629 WA0039

దళారీల నియంత్రణ

శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న ఆన్ లైన్ సేవలకు ఆధార్ తో లింక్ చేయడం ద్వారా పారదర్శకతతో పాటు దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు అవకాశం ఉందని టీటీడీ ఈవో జె. శ్యామలరావు చెప్పారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో యుఐడిఎఐ (ఆధార్ సంస్థ) అధికారులు, టిసిఎస్, జీయో, టీటీడీ ఐటి విభాగంతో ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఇది వరకే టీటీడీ దర్శనం, వసతి, ఆర్జిత సేవలు, శ్రీవారి…

Read More
ttd swami

మళ్లీ సుప్రభాత సేవ…

ధనుర్మాసం రేపటితో ముగుస్తున్నందున తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 15 నుంచి సుప్రభాత సేవ పునః ప్రారంభం కానుంది. గత ఏడాది డిసెంబర్‌ 17న తెల్లవారుజామున 12.34 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. జనవరి 14వ తేది ధనుర్మాస ఘడియలు పూర్తి కానుండడంతో 15 నుంచి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించ వలసిందిగా టీటీడీ…

Read More
tpt drone

భక్తి కాదు..బలుపు…!

భక్తిని చాటుకోవలసిన చోట బలుపు కనిపించింది. పవిత్ర తిరుమల కొండ మలుపుల్లో ఓ జంట అధికారుల కళ్ళు గప్పి డ్రోన్ కెమెరాను చంకన వేసుకుపోయింది. ఇందులో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. తిరుమలలో విజిలెన్స్ నిఘా వైఫల్యానికి సాక్ష్యంగా నిలిచింది. అస్సాం కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఘాట్ రోడ్డు 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ సాయంతో తిరుమల కొండలను వీడియో తీశారు. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డు లోని…

Read More
cheetha

ఐదో చిరుత…

అలిపిరి కాలినడక మార్గంలో మరో చిరుత సంచరిస్తోంది. ఈ విషయం గుప్పుమనడం శ్రీవారి భక్తులు భయందోలనకు గురిచేస్తోంది. కాలిబాటలోని లక్ష్మీనరసింహ ఆలయం వద్ద చిరుత తిరుగుతున్న దృశ్యాలు ట్రాప్‌ కెమెరాల్లో నమోదయ్యాయి. ఇటీవల చిరుత దాడికి గురై మరణించిన చిన్నారి లక్షిత(6) మృతదేహం లభ్యమైన ప్రాంతంలోనే చిరుత సంచరించినట్లు అధికారులు తెలిపారు. ఇప్ప‌టికే నాలుగు చిరుత‌ల‌ను ప‌ట్టుకున్న అట‌వీ శాఖ ఐదో దానిపై దృష్టి పెట్టింది. దాన్ని పట్టుకోవడానికి వివిధ ప్రాంతాల‌లో బోనులు ఏర్పాట్లు చేశారు. మెట్ల…

Read More
ttd

పోస్టర్…

తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లును టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి విడుదల చేశారు. రాబోయే స్వామివారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి టిటిడి సన్నాహాలు చేస్తోంది.

Read More
IMG 20230814 WA0001

ఇక రక్షణ చర్యలు…

తిరుమల వెళ్ళే కాలినడక మార్గంలో పిల్లల పై చిరుత పులుల దాడి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అప్రమత్తమైంది. శ్రీవారి దర్శనం కోసం అలిపిరి నుంచి మెట్ల ద్వారా వచ్చే భక్తుల భద్రతకు రక్షణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలను కాలినడక మార్గంలో అనుమతించడం లేదు. రెండు కనుమ రహదారుల్లో సాయంత్రం ఆరు గంటల తర్వాత ద్విచక్ర వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఏడో మైలు వద్ద…

Read More
ex offic

ప్రమాణం…

రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలవన్ తిరుమల తిరుపతి దేవస్థానంఎక్స్-అఫిషియో సభ్యునిగా శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ ఈవో ఎ.వి.ధ‌ర్మారెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంత‌రం వేద‌పండితులు తీర్థ ప్రసాదాలు ,వేదాశీర్వచ‌నం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆలయం కరికాలవలవన్ మీడియాతో మాట్లాడుతూ . తనకు ఈ అవకాశం కల్పించిన వేంకటేశ్వర స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. తిరుమలలో భక్తులకు ఇప్పటికే మెరుగైన వసతులు ఉన్నాయని చెప్పారు . స్వామివారి ఆశీస్సులు, బోర్డు,…

Read More
tpt croud

దర్శనం…

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శుక్రవారం 71,472 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.77 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 31,980 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు లైన్లో వేచి ఉన్నారు.

Read More