
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లద్ధక్ సమీపంలోని బేరి ప్రాంతం వద్ద ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వ్యాన్ లోయలో పడి 8 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనతో రంగారెడ్డి జిల్లా తంగళ్ళ పల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో ఒక జవాను రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం పరిధిలోని తంగెళ్లపల్లి గ్రామ పంచాయతీ లోని తిర్మాన్ దేవునిపల్లి గ్రామనికి చెందిన చంద్ర శేఖర్(30) కూడా ఉన్నారు.

నిరుపేద కుటుంబానికి చెందిన మల్లయ్య ,శివమ్మకు ముగ్గురు సంతానం. వారిలో చిన్నవాడైన చంద్ర శేఖర్ ముదిరాజ్ ఒకటవ తరగతి నుండి ౩ వరకు తిర్మాన్ దేవునిపల్లి గ్రామంలో 4 వ తరగతి నుండి 7 వరకు తంగెళ్లపల్లి గ్రామంలో తర్వాత కొందుర్గ్ బీసీ హాస్టల్ లో ఉంటూ 10వ తరగతి వరకు చదువుకున్నాడు .చిన్నప్పటి నుండి దేశ రక్షణ సేవలో పని చేయాలని కోరిక ఉన్న శేఖర్ 10వ తరగతి పూర్తి కాగానే దేశ సేవ కోసం అర్మీలో చేశారు. చంద్ర శేకర్ తల్లిని ,భార్య ,పిల్లలను పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని గ్రామస్తులు పరామర్శించారు.
