Screenshot 20230822 211732 Video Player

నన్ను చంపే కుట్ర…

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని నటుడు, ఏపీ చలన చిత్ర అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి సంచలన ఆరోపణలు చేశారు. లోకేష్ పీఏ చైతన్య తనకు ఫోన్ చేసి టీడీపీ లో చేరాలని ఆహ్వానించినట్లు తెలిపారు. నేను ఒప్పుకోకపోవడంతో చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పోసాని విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ లోకేష్ అక్రమాలపై విమర్శలు చేసినందుకు తనపై రూ. 4 కోట్ల పరువునష్టం కేసు వేశారని…

Read More
IMG 20230820 WA0012

లోయ లోకి…

అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డు లో ఘోర రోడ్డు ప్రమాదం చోటచేసుకుంది.పాడేరు నుండి చోడవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డు వ్యూ పోయింట్ వద్ద అదుపు తప్పి లోయలో నుండి పడిపోయినట్టు తెలుస్తోంది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్టు, ఇద్దరు చనిపోగా, పలువురు గాయపడ్డట్టు సమాచారం అందింది. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది. తీవ్ర గాయాలయ్యలైన వారిని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్ కి తరలించారు.

Read More
IMG 20230817 WA0033

బస్సులో “బాబు”…

ఆంధ్ర ప్రదేశ్ కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరులో భవిష్యత్ కు గ్యారెంటీ ప్రచార కార్యక్రమంలో భాగంగా బస్సులో ప్రయాణించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మహిళలతో మాట్లాడారు. నిత్యావసర వస్తువుల ధరలు, ప్రభుత్వ పన్నుల పై మహిళలు తమ అవేదన వ్యక్తం చేశారు. మహిళలకు టీడీపీ ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం పై హర్షం వ్యక్తం చేశారు.

Read More
Screenshot 20230817 170851 WhatsApp

పోటెత్తిన “పోర్టు”…

విశాఖ గంగవరం పోర్టు వద్ద కార్మికులు చేపట్టిన ‘పోర్టు బంద్’ ఉద్రిక్తతకు దారి తీసింది. తొలగించిన పోర్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు కనీస వేతనం రూ.36 వేలు చెల్లించాలనే డిమాండ్లతో కార్మిక సంఘాలు బంద్ కి పిలుపు నిచ్చాయి. ఈ మేరకు గురువారం ఉదయం  కార్మికులు, నిర్వాసితులు, కాలుష్య ప్రభావిత ప్రాంతాల ప్రజలు, అఖిలపక్ష నేతలు పెద్ద ఎత్తున గంగవరం పోర్టు వద్దకు చేరుకున్నారు.  కార్మికుల బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. పోర్టు…

Read More
IMG 20230814 WA0001

ఇక రక్షణ చర్యలు…

తిరుమల వెళ్ళే కాలినడక మార్గంలో పిల్లల పై చిరుత పులుల దాడి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అప్రమత్తమైంది. శ్రీవారి దర్శనం కోసం అలిపిరి నుంచి మెట్ల ద్వారా వచ్చే భక్తుల భద్రతకు రక్షణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలను కాలినడక మార్గంలో అనుమతించడం లేదు. రెండు కనుమ రహదారుల్లో సాయంత్రం ఆరు గంటల తర్వాత ద్విచక్ర వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఏడో మైలు వద్ద…

Read More
roja

రీమేక్‌ స్టార్‌ “పవన్‌”…

వెనకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖను పరిపాలన రాజధానిగా సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటించిన నాటి నుంచి  చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ అదే పనిగా విషం చిమ్ముతున్నారని మంత్రి ఆర్‌కె రోజా అన్నారు. విశాఖ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి సీఎం కృషి చేస్తుంటే, ఆ నగరాన్ని క్రైమ్‌ సిటీగా, అక్కడి ప్రజలను అవమానించే విధంగా పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతున్నారు. చంద్రబాబు మాట్లాడినట్టు , విమర్శించినట్టు పవన్‌ కళ్యాణ్‌ కూడా అదే బాటలో వెళ్తూ పవర్‌స్టార్‌గా కాకుండా, రీమేక్‌…

Read More
tpt

చిరుతకు బలి…

ఏడు కొండల వాడిని చేరుందుకు నడక దారిన వెళ్ళే పర్యాటకులకు భక్తి కంటే భయం పెరిగే పరిస్థితి నెలకొంది. కాలినడకన వెళ్తున్న ఓ బాబుపై చిరుత దాడి చేసిన సంఘటన మరవక ముందే ఇంకో చిన్నారి చిరుతకు బలైంది. తిరుమల వెళ్ళే అలిపిరి నడక మార్గంలో నిన్న రాత్రి తప్పిపోయిన లక్షితా అనే ఆరు ఏళ్ల పాప లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద విగత జీవిగా లభించిది. తప్పిపోయిన బాలికను లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద చిరుత పులి దాడి…

Read More
babu 1 1

“చంద్ర”యాన్ …

జనాన్ని ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు నానారకాల తంటాలు పడుతుంటాయి. అందులో భాగంగానే ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఈ రకమైన చిత్రాన్ని రుపొందించింది. “చంద్ర”యాన్ పేరుతో “బాబు రావాలి…రాష్ట్రం గెలవాలి” , “సైకో” పాలనా పోవాలి అనే చంద్రబాబు మాటలను జోడించి దీన్ని విడుదల చేశారు.

Read More
babu 1

ఏ1 గా చంద్రబాబు..

పుంగనూరు అల్లర్ల కేసులో చంద్రబాబుపై ఎఫ్.ఐ.అర్. నమోదైంది. ఈ నెల 4న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన “యుద్ధభేరి” పర్యటనలో చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన అల్లర్లకు సంబంధించి పోలీసులు తాజాగా మరో రెండు కేసులు నమోదు చేశారు. అన్నమయ్య జిల్లా ముదివీడు పీఎస్‌లో ఏ1 గా చంద్రబాబు, ఏ 2గా దేవినేని ఉమ, ఏ3గా అమర్నాథ్‌రెడ్డి పేర్లతో ఎఫ్.ఐ.అర్. నమోడు చేసినట్టు పోలీసులు తెలుపారు. ఇదిలా ఉంటే, అల్లర్లకు…

Read More
ka paul 1

విశాఖ నుంచి పోటీ…

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏదో ఒక అంశాన్ని చర్చనీయాంశంచేస్తారు. వచ్చే ఎన్నికలలో విశాఖ పట్నం నుంచి లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించారు. జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమానికి హాజరైన అయన విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నాయని పాల్ మండిపడ్డారు. విశాఖ స్థానికుదడిననీ, రానున్న రోజుల్లో ఇక్కడే నివాసం ఉంటానని చెప్పారు. అంతేకాక, రాబోయే ఎన్నికలలో విశాఖ…

Read More
jagan.air

జగన్ తో భేటీ…

ఎన్‌సీసీ ఆంధ్ర, తెలంగాణ ప్రాంత డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ వి.ఎం.రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.

Read More
ex offic

ప్రమాణం…

రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలవన్ తిరుమల తిరుపతి దేవస్థానంఎక్స్-అఫిషియో సభ్యునిగా శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ ఈవో ఎ.వి.ధ‌ర్మారెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంత‌రం వేద‌పండితులు తీర్థ ప్రసాదాలు ,వేదాశీర్వచ‌నం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆలయం కరికాలవలవన్ మీడియాతో మాట్లాడుతూ . తనకు ఈ అవకాశం కల్పించిన వేంకటేశ్వర స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. తిరుమలలో భక్తులకు ఇప్పటికే మెరుగైన వసతులు ఉన్నాయని చెప్పారు . స్వామివారి ఆశీస్సులు, బోర్డు,…

Read More
garuda

అధిక మాసం.. గరుడ సేవ..

తిరుమ‌ల శ్రీవారి ఆలయంలో అధిక మాసం శ్రావణ పౌర్ణమి గరుడ సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీ వేంకటేశుని వేదం పండితులు పవిత్ర మంత్రోచ్చారనలతో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

Read More
srisailam

నిండుతోంది..

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదలతో శ్రీశైలం జలాశయం నిండు కుండగా మారుతోంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను 816.20 చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 215.807 టీఎంసీలగాను 38.1234 టిఎంసిలుగా నమోదయింది.

Read More
roja pc

చంద్రబాబుకు “ఆల్జీమర్స్”..

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆల్జీమర్స్ వ్యాధిగ్రస్తుడిలా తయారై ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియకుండా నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గ స్థాయి అభివృద్ధి సమీక్ష సమావేశంలో పాల్గొన్న రోజా మీడియాతో మాట్లాడారు. టిడిపి హయాంలో అప్పటి మంత్రులే గంజాయి సాగుపై బహిరంగంగా మాట్లాడారని, నాటి విషయాలను మరిచిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని విమర్శించారు.సెబ్ వ్యవస్థను తీసుకువచ్చి రాష్ట్రంలో…

Read More