టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని నటుడు, ఏపీ చలన చిత్ర అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి సంచలన ఆరోపణలు చేశారు. లోకేష్ పీఏ చైతన్య తనకు ఫోన్ చేసి టీడీపీ లో చేరాలని ఆహ్వానించినట్లు తెలిపారు. నేను ఒప్పుకోకపోవడంతో చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పోసాని విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ లోకేష్ అక్రమాలపై విమర్శలు చేసినందుకు తనపై రూ. 4 కోట్ల పరువునష్టం కేసు వేశారని ఆరోపించారు. ఇప్పటి నుంచి నేను కేసులు వేస్తానని, లోకేష్ గతంలో ఎవరిపైనా విమర్శలు చేయలేదా అని ప్రశ్నించారు.
నన్ను చంపే కుట్ర…
