gadder c

గడ్డర్ కింద కార్మికులు..

తిరుపతి శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణంలో అపశృతి చోటు చేసుకుంది. ఫ్లె ఓవర్ కు గడ్డర్ ను అమర్చే సమయంలో ప్రమాదం జరిగి ఆప్కాన్స్ సంస్థకు చెందిన ఇద్దరు కార్మికులు మృతి చెందారు. జెసిబిలతో విరిగిన గడ్డర్ ను తొలగించి మృత దేహాలను బయటికి తీశారు. మరణిచిన కార్మికులు వెస్ట్ బెంగాల్ కు చెందిన అవిజిత్, మరొకరు బీహార్ కు చెందిన బార్థో మాండల్ గుర్తించారు. దీనిపై అధికారులు విచారణ ప్రారంభించారు. గడ్డర్ పడిపోవడానికి కారణాలను తెలుసుకుంటున్నారు.

Read More
DURGA

జారిపడ్డ రాళ్లు…

విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి కొలువై ఉన్న ఇంద్రకీలాద్రిపై కొండరాళ్లు జారి పడడం ఆందోళనకు గురి చేసింది. ఎడతెరిపి లేకుండా వర్షం వల్ల రాళ్ళ చుట్టు ఉండే మట్టి కొట్టుకుపోయి రాళ్ళు ఘాట్‌ రోడ్‌ మీద పడ్డాయి. దీంతో అప్రమత్తమైన దేవస్థానం అధికారులు వెంటనే ఆ మార్గంలోని టోల్‌గేట్‌ను మూసివేశారు. భక్తులను మల్లికార్జున మహా మండపం మెట్ల మార్గం వైపు మళ్లించారు. ఇంజనీరింగ్‌ అధికారులు, సిబ్బంది ఘాట్ రోడ్డులో పడిపోయిన రాళ్లను యుద్ధప్రాతిపదికన తొలగించారు.

Read More
roja ramya

రోజా..రమ్య…

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడాశాఖ మంత్రి ఆర్.కె.రోజాని ఆమె స్నేహితురాలు, ప్రముఖ సినీ నటి రమ్య కృష్ణ నగరి లోని ఆమె స్వగృహంలో స్నేహపూర్వకంగా కలిశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి తిరుగు ప్రయాణంలో రోజా స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పుత్తూరు, నగరి మునిసిపాలిటి, నగరి, పుత్తూరు, వడమాలపేట, నిండ్ర, విజయపురం మండలాలకు చెందిన ప్రముఖ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More
bus flood

కొంచెంలో తప్పింది..

ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఒక ప్రైవెట్ ట్రావెల్స్ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. ఒరిస్సా రాష్ట్రం నుండి ఆంద్రప్రదేశ్ కి బయలుదేరింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం కల్లేరు గ్రామ పంచాయతీ పరిధిలోని కుయుగూరు – నిమ్మలగూడెం గ్రామాల జాతీయ రహదారిపై వరద నీటిలో చిక్కుకుంది. కుయుగూరు వాగు వరద నీరు రహదారిపై చేరడం, తెల్లవారు జామున 4.30 గంటలకు చీకటిగా ఉండడంతో డ్రైవర్ కి వరద నీరు సరిగా కనిపించ లేదు. దీంతో వరద…

Read More
pawan kkd 2

కేసు పడింది…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమపై చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలకు తీవ్ర మనస్తాపం చెందినట్టు విజయవాడ సివిల్ కోర్టులో ఓ మహిళా వాలంటీర్ పవన్ కల్యాణ్ పై పిటిషన్ వేసింది. పవన్ మాటలు మానసిక వేదనకు గురిచేశాయని పేర్కొంది. ఈ మేరకు వాలంటీర్ దాఖలు చేసిన పిటిషన్ కోర్టు విచారణకు స్వీకరించింది.

Read More
Screenshot 2023 07 24 114251

ఇంతే పడుకుంటా…

అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఫలితంగా జనం నానా ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా వర్షాలు వచ్చినప్పుడు రోడ్ల విషయంలో పడే బాధలు అన్నీ ,ఇన్నీ కావు. గల్లీ గల్లీలో రోడ్ల సమస్య పట్టిపీడిస్తుంది. ఇలాంటి సమస్యతోనే అలసిపోయాడు ఓ వ్యక్తి. రోడ్డు దుర్బర పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి నిరసన తెలియజేయలనుకున్నాడు. అంతే.. నడిరోడ్డుపై కూర్చోలేదు… కానీ పడుకున్నాడు… ఎలా అంటారా…ఏలూరు నగరంలో గంగానమ్మ గుడి వద్ద రహదారిపై నీరు నిలవడంతో ఓ వ్యక్తి వినూత్న నిరసన తెలిపలనుకున్నాడు….

Read More
notes

సినిమా చూపిన ముఠా …

మార్కెట్ లో రోజుకో రూపంలో మోసగాళ్ళు తిరుగుతున్నా అత్యాశపడే వారికి మాత్రం వాళ్ళు కనిపించడంలేదు. “ఒకటికి రెండు” అనే బురుడీ మాటలు చెబుతున్నవారి వలలో చిక్కుకుంటున్నారు. ఆ క్రమంలో నిలువునా మోసపోతున్నారు. నంద్యాలలో సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది. ఒకటికి మూడింతలు అంటూ కోట్ల రూపాయలు దోచుకుపోయారు. ఈ వివరాల్లోకి వెళ్తే అసలు నోట్లకు మూడింతలు నకిలీ నోట్లు ఇస్తామని స్థానిక స్థిరాస్తి వ్యాపారి మదన్ మోహన్ రెడ్డి ని ఓ ముఠా నమ్మించింది. తాము ఇదే…

Read More

కొరికేసింది…

ఒకొక్కరు ఒక్కో రకం అంటారు. ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఇలాటి ఉహించని  సంఘటనే అనంతపురంలో జరిగింది. చదవడానికి కొంచం ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. విషయం ఏంటంటే ముద్దు పెట్టడనికు వచ్చిన భర్త నాలుక కోరికేసింది ఓ భార్య.ఆ వివరాలు చూద్దాం. గుంటూరు జిల్లాకు చెందిన తారాచంద్ నాయక్  కర్నూలు జిల్లా తుగ్గలి మండలానికి చెందిన పుష్పవతి భార్య భర్తలు. వీళ్ళు2015వ సంవత్సరంలో వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి వారికి ఇద్దరు పిల్లల…

Read More
dimand

వజ్రాల వేట..

ఎక్కడి సమాచారమో ఏమో గానీ ఆ ప్రాంతం తిరునాళ్ళ మాదిరిగా తయారైంది. రంగురాళ్ళు కాదు, కోరండం రాళ్ళూ కాదు ఏకంగా వజ్రాలే. వజ్రాలు దొరుకుతున్నాయనే వదంతులు వ్యాపించడంతో ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లాలోని బసవమ్మ వాగు జనసంచారంతో కోలాహలంగా మారింది. సత్తెనపల్లి సమీపంలోని బసవమ్మ వాగు వద్ద వజ్రాలు దొరుకుతున్నాయనే వదంతులతో పలు ప్రాంతాల నుండి జనం కుటుంబ సమేతంగా వచ్చి వజ్రాలను వెతకడం మొదలుపెట్టారు. కొందరు పిల్లలను పాఠశాలలు మాన్పించి మరీ వజ్రాలు వెతికేందుకు తీసుకొచ్చారు….

Read More

పొంచి ఉంది…జర భద్రం…

తెలుగు  రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా యడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జనజీవనం సతమతం అవుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు  పొంగిపొర్లడంతో రహదారులు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాదపు 36 గంటల నుంచి నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలు గోదావరి తీరప్రాంత వాసులను భయందోలనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి ఎగువ  ప్రాంతంలోని  ప్రాజెక్టులు నుండి వస్తున్న  వరద నీటి వల్ల  రాజమండ్రి, భద్రాచలం  వద్ద నీటి మట్టాలు పెతుగుతున్నాయి. ఇప్పటకే భద్రాచలం వద్ద…

Read More
pawan delhi

దీని కోసమే చూస్తున్నా…

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పొత్తులపై భాజపా నేతలతో చర్చించే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఎన్డీయే భేటీలో పాల్గొనేందుకు దిల్లీ వచ్చిన పవన్ మీడియాతో మాట్లాడుతూ ఈ అవకాశం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఈ భేటీ కోసం భాజపా సీనియర్‌ నేతలు ఆహ్వానించారని, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి మార్గాలపై చర్చిస్తామని, ఎన్డీయే విధానాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్నదానిపై సమాలోచనలు చేయనున్నాట్టు పవన్‌ కల్యాణ్‌ వివరించారు.

Read More
Screenshot 2023 07 16 143737

నేనదే..మరి నువ్వూ…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి రోజాకు బాలివుడ్ భామ  సన్నీ లియోన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ని విమర్శించేటప్పుడు తనను మధ్యలో ఎందుకు లాగావ్ అంటూ ఫైర్ అయింది. నేను పోర్న్ స్టార్ నే కానీ, నా గతం గురించి అస్సలు నేను బాధపడటం లేదు. మీలా కాకుండా నేను చేయాలనుకున్నది బహిరంగంగానే చేశానని చెప్పేసింది. నీకు నాకు తేడా ఒక్కటే  నేను ఇండస్ట్రీని వదిలేశాను, నువ్వు కాదు అంటూ చురకలు పెట్టింది. ఎవరు ఎలా అర్ధం…

Read More
pawan nadela

ఢిల్లీకి “సేన”..

ఢిల్లీలో ఈ నెల 18న జరగనున్న ఎన్డీఏ సమావేంలో పాల్గొనవలసినదిగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం అందింది. ఎన్డీఏలో భాగస్వాములైన రాజకీయ పక్షాల అగ్రనేతలు హాజరవుతున్న ఈ సమావేశంలో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ , పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ నెల 17 సాయంత్రానికి ఢిల్లీ వెళ్తారు.

Read More
tpt croud

దర్శనం…

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శుక్రవారం 71,472 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.77 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 31,980 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు లైన్లో వేచి ఉన్నారు.

Read More