కొరికేసింది…

ఒకొక్కరు ఒక్కో రకం అంటారు. ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఇలాటి ఉహించని  సంఘటనే అనంతపురంలో జరిగింది. చదవడానికి కొంచం ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. విషయం ఏంటంటే ముద్దు పెట్టడనికు వచ్చిన భర్త నాలుక కోరికేసింది ఓ భార్య.ఆ వివరాలు చూద్దాం. గుంటూరు జిల్లాకు చెందిన తారాచంద్ నాయక్  కర్నూలు జిల్లా తుగ్గలి మండలానికి చెందిన పుష్పవతి భార్య భర్తలు. వీళ్ళు2015వ సంవత్సరంలో వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి వారికి ఇద్దరు పిల్లల సంతానం కలిగింది. కాపురం సజావుగానే సాగుతోంది, కానీ, రెండేళ్ల నుంచి ఇరువురి  మధ్య మనస్పర్ధలు పెరిగాయి. మొన్న కూడా వారిద్దరూ గొడవ పడ్డారు. అదే రోజు భార్య దగ్గరకు వెళ్లి ముద్దు పెట్టుకోవడానికి  తారాచంద్ ప్రయత్నించాడు. ఆ ముద్దు ఇష్టం లేని పుష్పవతి ఏకంగా అతని నాలుకను కోరికేసింది. దీంతో తారాచంద్ దిమ్మతిరిన తారాచంద్ లబోమంటూ కేకాలు వేయడంతో చుట్టుపక్కల వారు అతన్ని గుత్తి హాస్పిటల్‌కు వెళ్లారు. అతన్ని పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స అనంతపురం హాస్పిటల్‌కు పంపారు. తనకు ఇష్టం లేకుండా బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి వచ్చాడని, అందుకే నాలుక కోరికినట్టు  పుష్పవతి జొన్నగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *