konasima bore

బోరు నుంచి మంటలు..

కోనసీమ జిల్లాలోని ఓ ఆక్వా చెరువు వద్ద బోరులోంచి గ్యాస్‌, అగ్నికీలలు ఎగసిపడటం కలకలం రేపింది. రాజోలు మండలం శివకోటిలోని ఆక్వా చెరువు వద్ద ఈ ఘటన జరిగింది. ఉదయం నుంచి అగ్నికీలలు, గ్యాస్‌ ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 20 అడుగుల మేర ఈ మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ రంగంలోకి దిగింది. మంటలార్పేందుకు అగ్నిమాపక, ఓఎన్జీసీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, ఈ ఘటన జరిగిన ప్రదేశంలో గ్యాస్‌ కోసం గతంలో సెస్మిక్‌…

Read More
sand

నిషేధం…

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక తవ్వకాల విషయంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అనేక ప్రాంతాల్లో అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై  వచ్చిన ఫిర్యాదులను విచారించిన జాతీయ హరిత ట్రైబ్యునల్ వీటిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.  అక్రమ ఇసుక తవ్వకాలపై గతేడాది మార్చి 23న ఎన్జీటీ నిషేధం విధించింది. దీన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం విచారణ జరిపింది. వాదోపవాదాలు విన్న…

Read More
bs chandra

బాధాకరం.

శ్రీ చైతన్య విద్యా సంస్ధల అధినేత బీ.ఎస్ రావు అకాల మరణం అత్యంత బాధాకరమని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో బీ.ఎస్ రావు భౌతిక కాయానికి చంద్రబాబు నాయుడు , లోకేష్, బ్రహ్మిణి విడివిడిగా నివాళి అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ బీఎస్ రావు మంచి దూరదృష్టి ఉన్న వ్యక్తి అని, సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ శక్తిగా ఎదిగారన్నారు. బీఎస్ రావు దంపతులు…

Read More
bhuvneswri c

అమ్మ వారి సేవలో..

ఆంధ్ర ప్రదేశ్ బిజెపి ఏపీ అధ్యక్షురాలుగా నియమితురలైన దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు, పురంధేశ్వరి దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేశారు.

Read More
ap

ఉల్లంఘిస్తే తప్పదు…

కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారి ప్రవీణ్‌ కుమార్‌కు హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. ప్రవీణ్‌ కమార్‌ ప్రస్తుతం ఏపీఐఐసీ ఎండీగా ఉన్నారు. గతంలో విశాఖపట్నం కలెక్టర్‌గా ఉన్న సమయంలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. భీమునిపట్నం మండలంలోని కాపులప్పాడ గ్రామం పరిధిలో ఏడు ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ నిలిపివేసి దాన్ని నిషేధిత భూముల జాబితాలో చేర్చారని అభియోగాలున్నాయి. ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని 2017లో…

Read More

శుభకార్యానికి వెళ్తూ..

ప్రకాశం జిల్లా దర్శి లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి సాగర్ బ్రాంచి కాలువలో పడడంతో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఒక వృద్ధుడు ఉన్నారు. వీరంతా కాకినాడలో జరిగే ఓ శుభకార్యంలో పాల్గొనడానికి పొదిలి నుండి వెళ్తున్నట్లు తెలిపారు. ఒంగోలు డిపోకు చెందిన ఆర్టీసీ బస్ లో వీరంతా ప్రయాణిస్తున్నారు. చనిపోయిన వారిలో ఓ మైనర్ బాలిక కూడా ఉంది. బస్సులో మొత్తం…

Read More
pawan 12

ఆ మాటలేంటి…

ఆంధ్రప్రదేశ్ లో మానవ అక్రమ రవాణా ఎక్కువైందననీ జనసేన అధినేత పవన్ కల్యాణ్  చేసిన వ్యాఖ్యలు  వివాదంగా మారాయి.  వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థే మానవ అక్రమ రవాణాకు ప్రధాన కారణమని ఆరోపించడంతో మహిళలు భగ్గుమంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాలంటీర్ల నుండి నిరసనలు వెల్లువెత్తుసున్నాయి. పవన్ కళ్యాణ్ ఆరోపణలపై స్పందించిన ఏపీ మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీనిపై కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని…

Read More
swarna

ఆ మోజులో పడీ…

ఈ అధికారి గురించి తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఏదో సినిమాల్లో వినోదం కోసం రచయితలు పాత్రలను సృష్టిస్తారు. అది అంతవరకే పరిమితం. కానీ, అలాంటి కధలనే స్ఫూర్తిగా తీసుకుందో ఏమో ఈ మహిళా పోలీస్ ఏకంగా మాయల ముఠాకే నాయకురాలైంది. అదీ ఎక్కడో కాదు, సాగరతీరం  విశాఖ పట్నంలో అంటే ఆశ్చర్యం కలుగుతుంది. యూనిఫామ్ ముసుగేసుకొని  కొంత కాలంగా రకరకాల దండాలకు పాల్పడుతున్న ఆమె బండారం బయటపడింది. ఏకంగా ఓ దోపిడీ ముఠానే నడుపుతున్నట్లుగా వెల్లడైంది.  ఈమె…

Read More
jagan ys

నాన్నకు నివాళి…

జననేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్.‌రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా, వైఎస్‌ఆర్ జిల్లా, ఇడుపుల పాయలో వైయస్సార్‌ ఘాట్ వద్ద  ముఖ్యమంత్రి వైయస్‌.జగన్, వైయస్‌.భారతి, వైయస్‌.విజయమ్మ, ఇతర కుటుంబసభ్యులు ఘనంగా నివాళులర్పించి, ప్రార్ధన నిర్వహించారు.

Read More

జననేతకు నివాళి…

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయ లోని ఆయన సమాధి వద్ద షర్మిల, విజయమ్మ నివాళులర్పించారు. వీరితో పాటు షర్మిల కుమారుడు రాజారెడ్డి, కూతురు అంజలి కూడా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వైఎస్ సమాధి వద్ద నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. షర్మిల, ఇతర కుటుంబ సభ్యులు నిన్ననే ఇడుపులపాయకు చేరుకున్నారు.

Read More
jagan modi

ఒకసారి చూడండి…

ఆంధ్ర ప్రదేశ్ లో  విభజన హామీలు నెరవేర్చాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి   వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి  ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీని కోరారు. ఒకరోజు పర్యతనాకు ధిల్లి వచ్చిన జగన్ ప్రధాని, ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్, హోం మంత్రి అమిత్‌ షా తో  భేటీ అయ్యారు.  ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పలు అంశాలపై చర్చ సుదీర్ఘ చర్చలు జరిపారు. రాష్ట్ర విభజన హామీలు సహా అపరిష్కృత అంశాలపై  వెంటనే  దృష్టి పెట్టాలనీ ప్రధాని నరేంద్ర…

Read More
revanth pongu

దూకుడే….

కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో దూకుడు పెంచింది. కర్ణాటక ఎన్నికల తర్వాత అటు ఏపీ, ఇటు తెలంగాణలో ముమ్మరంగా  కార్యక్రమాలు చేపడుతోంది. కొన్ని రోజులు క్రితం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయగా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేపట్టారు. పీపుల్స్ మార్చ్ పేరుతో దాదాపు 109 రోజులు పాటు ఆయన ప్రజల్లో తిరిగారు. ప్రస్తుతం భట్టి చేపట్టిన పాదయాత్ర ఆదివారంతో ముగియనుంది. ఈ సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు…

Read More

కొత్త డైరెక్టర్….

తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిటూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) డైరెక్టర్ గా శ్రీమతి సదా భార్గవి నియమితులయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆమె బాధ్యతలు చేపట్టారు.

Read More

దారుణం….

సోషల్ మీడియా నిబంధనల్లో సంస్కరణలు  తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆంధ్ర ప్రేదేశ్ రాష్ట్ర మహిళ కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. సచివాలయంలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ మహిళలపై పైశాచికత్వానికి పరాకాష్టగా సోషల్ మీడియాలో పోస్టింగులు ట్రోల్ చేయడం దురదృష్టకరమన్నారు. ప్రధానంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులకు చెందిన మహిళలపై  అసభ్యకరమైన పదజాలంతో పాటు అశ్లీల చిత్రాలు, అక్రమ సంబంధాల వంటి కట్టు కథల పోస్టింగులు సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం ఎంతో జుగుప్సాకరమైన…

Read More