ఆంధ్ర ప్రదేశ్ లో విభజన హామీలు నెరవేర్చాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఒకరోజు పర్యతనాకు ధిల్లి వచ్చిన జగన్ ప్రధాని, ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్, హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పలు అంశాలపై చర్చ సుదీర్ఘ చర్చలు జరిపారు. రాష్ట్ర విభజన హామీలు సహా అపరిష్కృత అంశాలపై వెంటనే దృష్టి పెట్టాలనీ ప్రధాని నరేంద్ర మోదీ కి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత, విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు, కొత్త మెడికల్ కాలేజీలకు ఆర్థిక సహాయం తదితర అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్ళారు. సుమారు గంటన్నర పాటు ప్రధానితో సమావేశమైన జగన్ సమావేశమయ్యారు.
