pet land 1

ఇదెక్కడి న్యాయం…

ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారులు, నాయకులు, మంత్రుల  పొంతన లేని సమాధానాల వల్ల జర్నలిస్టులు రోడ్దేక్కే పరిస్థితికి దారి తీస్తోంది. ఇన్నేళ్ళు సుప్రీం కోర్టులో ఉన్న విచారణలను బూచిగా చూపిన వాళ్ళు కోర్టు తీర్పు వచ్చి పదినెలలు అవుతున్న దాని అమలుకు రోజుకో మాట చెప్పడాన్ని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీ సభ్యులు తీవ్రంగా గర్హిస్తున్నారు. అంతేకాక, ప్రభుత్వ వైఖరి వల్ల సొసైటి సభ్యులు తమకు న్యాయం చేయించాలని రాజకీయ పార్టీలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాదు, ఢిల్లీలో…

Read More
nursing cf

ఎన్నికలు ఎందుకు జరపరు….

రాష్ట్రంలో మెడికల్ కౌన్సిల్ కు  ఎన్నికలు జరుపుతున్నట్టే  నర్సింగ్ కౌన్సిల్ కు కూడా ఎన్నికలను జరపాలని తెలంగాణ నర్సింగ్ సమితి  డిమాండ్ చేస్తోంది. నర్సింగ్ కౌన్సిల్ ఏర్పడి దాదాపు 52 సంవత్సరాలు అయినప్పటికీ ఒక్కసారి కూడా ఎన్నిజలు జరపకపోవడం పట్ల సమితి అసంతృప్తి వ్యక్తం చేసింది. కొందరు తమ స్వప్రయోజనాల కోసం కావాలనే ఎన్నికలను అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించింది.ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ ఏర్రోళ్ళ శ్రీనివాస్ కి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ…

Read More

మహా ప్రమాదం….

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటి శ్రుతిశెట్టి, డి.జి.పి. అంజని కుమార్, నగర పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ తదితరులు.

Read More

ఉప్పల్ స్కైవాక్ …

ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద రూ.25 కోట్ల వ్యయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) నిర్మించిన ఉప్పల్ స్కై వాక్ ప్రాజెక్టును పురపాలక శాఖ మంత్రి కె.టి.అర్. లాంచనంగా ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బాటసారి భద్రతకు ఉప్పల్ స్కైవాక్ ఎంతో దోహదపడుతుందన్నారు. తొలుత మినీ శిల్పారామం వద్ద రూ.10 కోట్ల హెచ్ఎండిఏ నిధులతో నిర్మించిన మల్టీ పర్పస్ హాల్ మంత్రి ప్రారంభించారు. ఆ తర్వాత ఉప్పల్ చౌరస్తాలో స్కైవాక్ శిలాఫలకాన్ని…

Read More
Screenshot 2023 06 25 231516

వర్మ “వ్యూహం”…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా డైరెక్టర్ రాం గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న “వ్యూహం”  సినిమాకు సంబంధించిన  టీజర్ ను విడుదల చేశారు.

Read More
land board

నాకేమొద్దు…

రెండు సార్లు ఎం.ఎల్.ఎ.గా గెలిచినా వ్యక్తి గ్రామానికి చెందినా భూమిని కబ్జా చేయడం పెద్ద తప్పిదమే అని తన తండ్రి ఐన జనగాం సిట్టింగ్ ఎం.ఎల్.ఎ. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కుమార్తె తుల్జా భవాని రెడ్డి వ్యాఖ్యానించారు. చేర్యాల గ్రామంలో తన తండ్రి భూమిని కబ్జా చేసి తనకు తెలియకుండానే దాన్ని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడని తెలిపారు. అసలు విషయం తెలిసిందని గ్రామానికి చెందాల్సిన భూమి తనకు అవసరం లేదని, దాన్ని తిరిగి చేర్యాల మునిసిపాలిటికే…

Read More

గౌడ భవనానికి …

గౌడ అత్మ గౌరవ భవనానికి హైదరాబాద్ లోని కోకాపేటలో భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమం లో రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే లు ప్రకాష్ గౌడ్, వివేకానంద్ కలిసి పాల్గొన్నారు. గీత కార్మికులకు 12 కోట్ల 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అందజేశారు. బి.సి. సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వేంకటేశం, ఎక్సైజ్ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, మాజీ శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్, మాజీ…

Read More

బి.సి.ల సంగతేంటి ….

ఏజెన్సీ ప్రాంతాలలో నివాసం ఉంటున్న బీసీ వర్గాలలోని సంచార, అర్థ సంచార, విముక్త కులాలు, జాతుల ప్రజలను ప్రత్యేకంగా గుర్తించి వారి జీవన ప్రమాణాల మెరుగు పరిచేందుకు ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని సినీ నటుడు సుమన్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర బీసీ కమిషన్ ను కోరింది. కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, సభ్యులు, సి.హెచ్.ఉపేంద్ర, కె. కిశోర్ గౌడ్ లతో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలను కమిషన్ దృష్టికి తెచ్చారు….

Read More

మన్యం వీరుని …

మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు వేడుకలలో భాగంగా హైదరాబాదులో నిర్వహించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో  కేంద్ర పర్యాటక , సాంస్కృతిక మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ గౌడ్ ముఖ్య అతిథిలు గా పాల్గొన్నారు. ఈ కార్యమానికి   మాజీ పార్లమెంట్ సభ్యులు, సినిమా నటులు మురళీమోహన్, తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల క్షత్రియ సేవా సమితి సభ్యులు,…

Read More

లీగల్ ఎయిడ్ కేంద్రాలు …

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టమ్ (ఎల్ ఎ డి సి ఎస్ ) కార్యాలయాలు ప్రారంభం అయ్యాయి. వీటిని హైకోర్టు లో చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమా నికి పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు.

Read More

సురభి కెమికల్ మాకొద్దు….

సంగారెడ్డి జిల్లా హన్నుర్ మండలం వడ్డేపల్లి గ్రామస్తులు సనత్ నగర్ లోని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. వడ్డేపల్లిలోని సురభి కెమికల్ ఫ్యాక్టరీని వెంటనే మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ నుంచి వెలువడే దుర్గంధం వల్ల పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశ్గారు. అంటే కాక భూగర్భ జలాలు సైతం కలుషితం అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ కెమికల్ ఫ్యాక్టరీని వెంటనే తొలగించాలని నియంత్రణ…

Read More

రాజ్ నాథ్ తో కేటీఆర్..

రెండు రోజుల పర్యటనకు ధిల్లి వెళ్ళిన రాష్ట్ర పురపాలక, ఐ.టి. శాఖల మంత్రి కేటీఆర్ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. స్థానికుల సౌకర్యార్ధం సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాలను హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ లో కలిపేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కేటీఆర్ రాజ్ నాథ్ సింగ్ కి లేఖ అందజేశారు. అదే విధంగా, మెహదిపట్నం రైతు బజారు వద్ద చేపట్టే స్కై వాక్ నిర్మాణానికి కావలసిన…

Read More

బాలుడిపై చిరుత దాడి…..

తిరుమల నడక మార్గం ఏడోవ మైలు వద్ద చిన్నారి పై చిరుత దాడి చేసింది. ఐదు సంవత్సరాల బాలుడిని పైకి ఒక్కసారిగా విరుసుకుపడిన చిరుత అందరు చూస్తుండగానే ఎత్తుకుపోయింది. అక్కడే విధులో ఉన్న పోలిసులు కేకలు వేయడంతో చిరుత బాలుడిని వదిలేసి వెళ్ళింది. గాయ్యాల పాలైన బాలుడిని ఆసుపత్రికి తరలించారు. బాలుడిని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం చేర్పించారు. టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్యక్షులు వై.వి.సుబ్బారెడ్డి, పలువురు టి.టి.డి అధికారులు ప‌రామ‌ర్శించారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని…

Read More