power cmd

Reliability in Power Supply

In a move to ensure higher reliability in Power supply in GHMC, the Telangana Southern Power Distribution Company Limited (TGSPDCL) has adopted latest technologies to identify loose contacts/red hots in live electrical equipment and power lines caused due to weather and high load conditions. TGSPDCL has recently procured 35 state-of-the-art thermo-vision cameras, which have been…

Read Full News
kcr bailreg

పిటిషన్ కొట్టివేత..

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ కు ఈ రోజు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తన పై విచారణకు ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్ ఏర్పాటును రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేత్రుతవంలోని ధర్మాసనం కొట్టేసింది. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తరపు న్యాయవాదులతో హైకోర్టు విభేదించింది. విద్యుత్ కమిషన్ విచారణను కొనసాగించొచ్చంటూ ధర్మాసనం పేర్కొంది.

Read Full News
IMG 20240630 WA0051 1

Prestigious…

Telangana Chief Minister Revanth Reddy expressed his profound delight over the appointment of Challa Srinivasulu Setty as the new Chairman of the State Bank of India.The Chief Minister remarked that it is a momentous occasion that Srinivasulu, who hails from Jogulamba Gadwal district, has ascended to the prestigious position of Chairman of the SBI. On…

Read Full News
contnment

కంటోన్మెంట్ మున్సిపాలిటీ…

సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసుల చిరకాల కోరిక నెరవేరింది. కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలోని సివిల్‌ ఏరియాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా రక్షణ శాఖ మంత్రికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. మార్చి 5వ తేదీన రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసి…

Read Full News
pv jaiswrj

స్ఫూర్తీ దాత ..

సంస్కరణల ద్వారా దేశ ప్రజలకు ఆర్థిక ఫలాలు అందించాలనే లక్ష్యంతో పీ వీ నర్సింహా రావు సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకుని వచ్చారని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ పేర్కొన్నారు. పీవీని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలు లేని సమాజ నిర్మాణం కోసం పథకాలు చేపట్టాలని ఆయన సూచించారు. భారత రత్న మాజీ ప్రధాన మంత్రి, స్వర్గీయ గౌరవ పి. వి. నరసింహ రావు 103 వ…

Read Full News
revant pv

సంస్క‌ర‌ణ‌ల‌ నర”సింహం”

సంస్క‌ర‌ణ‌ల‌తో దేశ ఆర్థిక ప్ర‌గ‌తిని ప‌రుగులు పెట్టించిన ఘ‌నత మాజీ ప్ర‌ధాన‌మంత్రి పి.వి.న‌ర‌సింహారావుకు ద‌క్కుతుంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మాజీ ప్ర‌ధాన‌మంత్రి పి.వి.న‌ర‌సింహారావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని ఢిల్లీలోని త‌న అధికారిక నివాసంలో పి.వి. చిత్ర‌ప‌టానికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా, కేంద్రంలో వివిధ శాఖ‌ల మంత్రిగా, ప్ర‌ధాన‌మంత్రిగా పి.వి. చేసిన సేవ‌లు మ‌రువరానివ‌ని పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రితో పాటు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి…

Read Full News
IMG 20240628 WA0047

మరొకరు…

చేవెళ్ల శాసన సభ నియోజక వర్గం నుంచి భారత రాష్ట్ర సమితి తరఫున ఎన్నికైన కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదయ్యను పార్టీలోకి ఆహ్వానించారు.

Read Full News
IMG 20240626 WA0089

హోదా పెంచండి-అభివృద్ది చేయండి

తెలంగాణ ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ద‌క్షిణ భాగాన్ని జాతీయ ర‌హ‌దారిగా ప్ర‌క‌టించాల‌ని, హైద‌రాబాద్-విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిని ఆరు వ‌రుస‌లుగా విస్త‌రించాల‌ని జాతీయ ర‌హాదారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి గ‌డ్క‌రీతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, నూత‌న జాతీయ ర‌హ‌దారుల ప్ర‌క‌ట‌న‌, ఇప్ప‌టికే జాతీయ ర‌హ‌దారులుగా ప్ర‌క‌టించిన మార్గాల ప‌నుల ప్రారంభం త‌దిత‌ర అంశాలను…

Read Full News
IMG 20240626 WA0063

నిరసన…

విద్యార్థులను సస్పెండ్ చేస్తూ హైదారాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్.ఎఫ్.ఐ.) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సుకూన్ ఫెస్టివల్, విద్యార్థుల సమస్య లపై ప్రశ్నించినందుకు విద్యార్థులను సస్పెండ్ చేయడం పట్ల విద్యార్థి సంఘ నేతలు మండి పడ్డారు. సుభాషిని, నికిత్, రిషికేష్, పంకజ్, అజయ్ లను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ, 10 వేల రూపాయల జరిమాన విధించడాన్ని విద్యార్థులు ఖండించారు. సెంట్రల్ యూనివర్సిటీ వీసీ,…

Read Full News
IMG 20240626 WA0059

“రియల్” కార్మికులను ఆదుకోండి..

రియల్ ఎస్టేట్ వెంచర్లల్లో పని చేస్తున్న అసంఘటిత కార్మికులకు విద్య, వైద్యం అందించాలని జై స్వరాజ్ పార్టీ డిమాండ్ చేసింది. నిర్మాణాలలో పని చేస్తున్న అసంఘటిత కార్మికులకు పని ప్రదేశాల్లో క్వాలిఫైడ్ డాక్టర్ తో వైద్య సేవలు అందించే ఏర్పాటు చేయాలన్నారు. కార్మికుల పిల్లలకు నిర్మాణాల వద్ద పాఠశాలలు ఏర్పాటు చేయాలని జై స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడ్ కోరారు. కార్మిక నాయకులు, పార్టీ నాయకులతో హైదారాబాద్ లోని తెలంగాణ లేబర్ కమిషనర్ కృష్ణ…

Read Full News
IMG 20240626 WA0036

ఆ మాటే వద్దు..

మాదకద్రవ్యాల రహిత తెలంగాణ రాష్ట్రమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అన్నారు. డ్రగ్స్‌ రవాణాలో ఎంతటివారున్నా ఉపేక్షించబోమని, ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తుందని పేర్కొన్నారు. డ్రగ్స్‌ రవాణా చేసేవారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా నిర్ణయాలు ఉంటాయన్నారు. “అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం” సందర్భంగా హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి…

Read Full News
Screenshot 20240625 211748 Chrome

బకాయిలు ఇవ్వండి..

జాతీయ ఆరోగ్య మిష‌న్ (ఎన్‌హెచ్ఎం) కింద తెలంగాణ‌కు రావ‌ల్సిన బ‌కాయిలు రూ.693.13 కోట్లు వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.న‌డ్డాకు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని మంగ‌ళ‌వారం ఆయ‌న క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైద్యారోగ్య రంగంపై తెలంగాణ ప్ర‌భుత్వం పెడుతున్న ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌ను కేంద్ర మంత్రికి వివ‌రించారు. ఆయుష్మాన్ భార‌త్ నిబంధ‌న‌లన్నింటిని తాము ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి అమ‌లు చేస్తున్న‌ట్లు రేవంత్ వివరించారు….

Read Full News
IMG 20240625 WA0019

అక్రమమిస్తే చర్యలు..

హైదారాబాద్ లోని శేరింగంపల్లి మియాపూర్ లలో ప్రభుత్వ భూములను అక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శశాంక్ హెచ్చరించారు.సర్వే నెంబర్లను 100,101 ప్రభుత్వ భూములను ఆయన పరిశీలించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ భూములను కాపడలన్నారు.ప్రభుత్వ భూమి చుట్టూ కంచె ఏర్పాటు పనులు ప్రారంభించి త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు.అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.

Read Full News
IMG 20240624 WA0020

భారాస మరో వికెట్..

తెలంగాణాలో భారత రాష్ట్ర సమితికి చెందిన మరో వికెట్ జారీ పోయింది. గత ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి జగిత్యాల శాసన సభ్యునిగా ఎన్నికైన సంజయ్ కుమార్ అధికార కాంగ్రెస్ లో చేరారు. హైదారాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను కండువా కప్పి పార్టీల్లోకి ఆహ్వానించారు.

Read Full News
cancr

వార్షికోత్సవంలో…

హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి 24వ వార్షికోత్సవ వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. హిందూపురం ఎంఎల్ఏ బాలకృష్ణ, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆస్పత్రి బోర్డ్ సభ్యులు శ్రీ నామ నాగేశ్వర రావు రేవంత్ కి స్వాగతం పలికారు.

Read Full News