
భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఆర్దిక బంధాలు మరింత మెరుగు పడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశ పర్యటనలో కీలక అంశాలపై చర్చలు, ఒప్పందాలు జరిగాయి. ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్యపరమైన లవదేవిల్లో స్థానిక కరెన్సీలో చెల్లింపులు చేసులోవాలని యుఎఇ అధ్యక్షులు షేక్ మహ్మద్ బిన్ జేయేడ్ తో జరిగిన చర్చలో నిర్ణయించారు.ఇకపై ఎగుమతులు, దిగుమతుల సమయంలో రూపాయి, దిర్హమ్ లను చేల్లిన్సుకోవచ్చు. భారత్ యుపిఐ ఎమిరేట్స్ ఐపిపి ప్లాట్ ఫామ్ లను అనుసంధానం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఒప్పందాల ఆపై ఆర్ బి ఐ గవర్నర్ శక్తికాంతా దాస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఖలీద్ మహ్మద్ లు సంతకాలు చేశారు. అదేవిధంగా ధిల్లి ఐఐటి శాఖను అబుదాబిలో ఏర్పాటు చేయనున్నారు. ప్రధాని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటన సందర్భంగా అక్కడి బుర్జ్ ఖలీఫా ను త్రివర్ణ కాంతులతో అలంకరించారు. రాత్రి పూట లేజర్ షోతో ఈ భవనం పై మోడీ చిత్ర పటాన్ని ఆవిష్కరించారు.