ప్రభుత్వం పేట్ బషీరాబాద్ లో కేటాయించిన 38 ఎకరాల స్థలాన్ని సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి అప్పజెప్పాలని సొసైటీ సర్వసభ్య సమావేశం డిమాండ్ చేసింది. ఈ నెల 10వ తేదీలోపు ఆ భూమిలోని ఆక్రమణలు తొలగించి సొసైటీ కి బదలాయించాలని, లేకపోతే హైదరాబాద్ లోని అన్ని హెచ్.ఎం.డి.ఎ. కార్యాలయాల ముందు నిరసనలకు దిగుతామని వెల్లడించింది. పేట్ బషీరాబాద్ స్థలంలో జవహర్ లాల్ నెహ్రు హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం జరిగింది. కోర్టు తీర్పు వచ్చి ఏడాది కావస్తున్నా ప్రభుత్వం గానీ, అధికారులు గానీ దాన్ని అమలు చేయకపోవడంపై సమావేశం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ స్థలం విషయంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సానుకూలంగా వ్యవహరించి న్యాయం చేస్తారని సొసైటీ ఉపాధ్యక్షులు పల్లె రవికుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సభ్యుల మనోవేధనని అర్ధం చేసుకొని పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల భూమిని అప్పజెప్పాలని కార్యదర్శి వంశీ ప్రభుత్వాన్ని కోరారు.
ఇదిలా ఉంటే, సొసైటీ నిర్లక్ష్యం మూలంగానే సమస్య జటిలం అవుతోందని కొందరు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యదర్శి వంశీ మాటలకు కొందరు మండిపడ్డారు.