ఓరుగల్లులో గవర్నర్…

tamil wglc

వరంగల్ , హన్మకొండ జిల్లాలలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ పరిశీలించారు. జవహర్ నగర్, నయీమ్ నగర్, భద్రకాళి బండ్, ఎన్టీఆర్ నగర్, ఎన్ ఎన్ నగర్ ప్రాంతాలను పర్యటించి అధికారులను అడిగి నష్టం వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జవహర్ నగర్ లో“ రెడ్ క్రాస్ సొసైటీ” ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు వరంగల్ హన్మకొండ ప్రాంతాలలో అనేక లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని ఈ ప్రాంతంలోని ప్రజలను ఆదుకునేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేసినట్టుతెలిపారు. అనేక ముంపు ప్రాంతాలలో దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వెంటనే పునరుద్ధరించుటకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలోని ప్రజలకు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని ఆమె అన్నారు.

tamil wgl

భారీ వర్షాల వల్ల ముంపునకు గురికాకుండా ఈ ప్రాంతాలలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వానికి సూచించనున్నట్లు గవర్నర్ తెలిపారు. వరదలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసే విధంగా, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించుటకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆమె కోరారు. ప్రజలకు నిత్యవసర సరుకులు ఆహారం అందించడానికి రెడ్ క్రాస్ సొసైటీ స్థానిక అధికారులు తగిన చర్యలు చేపట్టనున్నట్లు గవర్నర్ తెలిపారు. ముంపు ప్రాంతాలలో ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాలలో ఇప్పటికే కేంద్ర బృందం పరిశీలించినట్టు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రవీణ్య, కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, ఆర్డీఓలు రమేష్ కుమార్, వాసు చంద్ర పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *