పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం, సహజ వనరులను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. వాతావరణ సంక్షోభం యొక్క ఆవశ్యకతను గుర్తించి, భవిష్యత్ తరాలకు మన గ్రహం యొక్క రక్షణ పట్ల అవగాహనను పెంచేందుకు చేపట్టే సామూహిక కార్యక్రమాలు చేపట్టాలని ఆమె సూచించారు. ‘ఇగ్నైటింగ్ మైండ్స్ ఆర్గనైజేషన్’ బృందం రాష్ట్రపతిని కలిసి తాము చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా పర్యావరణ పరిరక్షణకు సానుకూలంగా ఉండడం, పర్యావరణ పరిరక్షణ గురించి ప్రచారం చేయడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని చెప్పారు.‘వాక్ ఫర్ వాటర్’ ప్రతినిదులు కరుణాకర్ రెడ్డితో పాటు ఎం వీరన్న, కృష్ణ తేజా రెడ్డి, మాస్టర్ పవన్ కృష్ణ రెడ్డి తదితరులు రాష్ట్రపతిని కలిశారు.