హైదరాబాద్ లో ఏంతో కాలంగా ఎదురు చూస్తున్న జర్నలిస్టులకు వెంటనే ఇళ్ళ స్థాసాలు మంజూరు చేయాలని శాసన సభలో కాంగ్రెస్ ఎంఎల్ఏ జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. జంట నగరాల్లో అనేక మంది జర్నలిస్టులు సుప్రీం కోర్టులో కేసు నెగ్గి కూడా ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. శాసన సభ జీరో అవర్ లో జగ్గారెడ్డి ఈ మేరకు ప్రస్తావించారు. అయితే , దీనికి పురపాలక శాఖ మంత్రి కెటిఅర్ ఇచ్చిన సమాధానం సభ్యులను అసంతృప్తికి గురి చేసింది.
సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సూటిగా సమాధానం చెప్పకుండా, ఆ సమాధానంలో సీతక్కకు పోడు భూములు ఇచ్చామని, జగ్గారెడ్డి గతంలో అడిగిన విధగానే పనులు జరిగాయని చెప్తూ అసలు జర్నలిస్టులకు ఎప్పుడు స్థలాలు ఇచ్చే విషయాన్ని పక్కన పెట్టారు. మా ముఖ్యమంత్రే పదిసార్లు అప్పటి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రమణ తో మాట్లాడారని మాత్రం చెప్పారు. కానీ, ఆ తీర్పును ఎప్పుడు అమలు చేస్తారో మాత్రం స్పష్టం చేయలేదు. దీంతో జీరో అవర్ లో అడిగిన ప్రశ్న కాబట్టి జగ్గారెడ్డికి కూడా మరోమారు అడిగే అవకాశం రాలేదు. జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల గురించి ప్రశ్న వేస్తే మధ్యలో సీతక్క, ములుగు విషయాలు ఎందుకు వచ్చాయో సభ్యులకు అర్ధం కాలేదు.