సెంట్రల్ లో “రంగా” కూతురు...! - EAGLE NEWS

సెంట్రల్ లో “రంగా” కూతురు…!

ranga asha

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తి కరమైన పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీతో జతకట్టడం, ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేసే క్రమంలో పురదేశ్వరిని ఆ రాష్ట్ర బిజెపి శాఖకు అధ్యక్షురాలిగా చేయడం, చంద్రబాబు నాయుడు మాత్రం తన పంజాలో అధికార పార్టీని ఎండగడుతూ లోకేష్ ని రోడ్ షోలకు పంపి రాబోయే ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బెజవాడ  రాజకీయలు కేంద్ర బిందువుగా మారుతాయి.  రాజకీయంగా చైతన్యవంతమైన విజయవాడలో వివిధ పార్టీల వ్యవహారాలు, అక్కడ జరిగే ఎత్తులు, పై ఎత్తులు ఆకర్షిస్తాయి. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే అధికార,  ప్రతిపక్ష పార్టీలు ఒకరికి మించి ఒకరు చేస్తున్న కసరత్తులు చర్చలకు దారితీస్తున్నాయి. ఈ సారి బెజవాడ రాజకీయ చదరంగంలో స్వర్గీయ వంగవీటి రంగా కుమార్తె ఆశాలత హాట్ హాట్ గా మరే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడ వీధుల్లో జరుగుతున్న రాజకీయ చర్చల్లో ఆశాలత పేరు బలంగా వినిపిస్తోంది. ఆమె రాజకీయాల్లోకి రానున్నారని, బెజవాడ సెంట్రల్ నుంచి ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉందని చర్చ  తెరపైకి వస్తోంది.

cental in

వంగవీటి రంగా రాజకీయ వారసత్వాన్ని జనంలోకి తీసుకుపోవడానికి ఆయన కుమార్తెను ఎన్నికల బరిలోకి దించాలననే  ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందుకే, వచ్చే ఎన్నికల్లో రంగా కుటుంబానికి రాజకీయంగా గట్టి పట్టు ఉన్న విజయవాడ సెంట్రల్ నుండి ఆమెని బరిలోకి దింపేందుకు ఆమె దగ్గరి బందువు ఒకరు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమచారం. ఇదిలా ఉంటే, కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడం కోసం విజయవాడతో పాటు కోస్తా జిల్లాల్లో రంగా వారసత్వం ఉపయోగపడుతుందని భావిస్తున్న పార్టీలు వంగవీటి ఆశాలతను పార్టీలోకి  లాగడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. వంగవీటి రంగా హత్యకు గురై 30 ఏళ్ళు దాటినా కృష్ణా జిల్లా సహా గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కాపు సామాజిక వర్గంలో అయన పేరు ఇప్పటికీ చెక్కుచదరక పోవడం గమనార్హం. ఒకవేళ రంగా రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచనతో ఆశాలతను తెరపైకి తెసుకువస్తే బెజవాడ సెంట్రల్ నియోజక వర్గంలోనే కాక, మరికొన్ని ప్రాంతాలలోనూ ఆశించిన ఫలితాలు దక్కే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కానీ, ఇదే విషయాన్ని రంగా సమీప బంధువుల వద్ద్ద్ ప్రస్తావిస్తే అలాంటి ఆలోచన లేదని తోసిపుచ్చుతున్నారు. ఎన్నికల వేడి మరింత పెరిగితే గానీ అసలు విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *