మహారాష్ట్ర లోని థానేలో ఉన్న బందోడ్కర్ కాలేజీలోని మహా దారుణం జరిగింది. ఆ కాలేజిలో నిర్వహిస్తున్న ఎన్.సి.సి. శిక్షణలో జూనియర్లను ఓ సీనియర్ విచక్షణ రహితంగా కొట్టడం వివాదంగా మారింది. బందోడ్కర్ కాలేజీలో జూనియర్ లు తన మాట వినలేదని వారిని వర్షపు నీటిలో వంచి కర్రతో గొడ్డును బాదినట్టు చితకబాదాడు. ఈ విషయం బయటికి పొక్కడంతో ఆ దారుణానికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని కాలేజీ ప్రిన్సిపల్ సుచిత్ర నాయక్ చేతులు దులుపుకున్నారు. అయితే, పాశవికంగా కొట్టిన ఆ వ్యక్తిని కటినంగా శిక్షించాలని విద్యార్ధి సంఘాలు , సామజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.