సిగరెట్ టెన్షన్….

vande in

వందే భరత్ రైలు కోచ్ నుండి గుప్పుమన్న పొగలు ప్రయాణీకులను ఆందోళనకు గురి చేశాయి. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతున్న రైలులో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఒక బోగీలో అకస్మాత్తుగా పొగ వ్యాపించడంతో గమనించిన లోకో పైలెట్ మనుబోలు రైల్వే స్టేషన్‌లో రైలుని నిలిపివేశారు. అనంతరం రైల్వే పోలీసులు, అధికారులు తనఖి చేయగా ఓ ప్రయాణీకుడు బాత్ రూమ్‌లో కాల్చిన సిగరేట్ వల్లే ప్లాస్టిక్‌ కు అంటుకొని పొగ కమ్ముకున్నట్టు తేల్చారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోని విచారించగా టికెట్ లేకుండా రైలులోకి చొరబద్దట్టు తేలింది. పూర్తీ తనిఖిల అనంతరం వందే భారత్ హైదరాబాద్ కు బయలు దేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *