సినీ నటి, మాజీ ఎం.పి. జయప్రదకు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే, చెన్నైలోని అన్నా రోడ్ లో జయప్రదకు ఒక సినిమా హాలు ఉంది. ఆ సినిమా హాలు నిర్వహణ బాధ్యతలను ఆమె సోదరుడు రాజబాబు, అతని స్నేహితుడు రామ్ కుమార్ చూస్తుంటారు. అయితే, సిబ్బందికి జీత భత్యాలు, పి.ఎఫ్., ఇఎస్ఐ, వంటి ఇతర సదుపాయాలను సరిగా కల్పించాడంలేదని రిటైర్ అయిన ఒక ఉద్యోగి కార్మిక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన ఎగ్మోర్ కోర్టు జయప్రదకు ఆరునెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీనికి స్పందించిన జయప్రద సినిమా హాలు సిబ్బందికి సకాలంలోనే జీతాలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.