images 22

ఏమిటీ నిర్లక్ష్యం..పట్టదా..

కోల్ కతా అర్జీ కర్ ఆసుపత్రి వైద్యురాలి హత్యాచారం ఘటనలో ఆసుపత్రి సిబ్బందితో పాటు పోలీసులు, బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మృతదేహం పడి ఉన్న తీరును చూశాక అది ఆత్మహత్యని ఎలా భావించారని వైద్య సిబ్బందిని ప్రశ్నించింది. డాక్టర్ ఆత్మహత్య చేసుకుందని బాధితురాలి కుటుంబానికి చెప్పడం వెనక కారణమేంటని నిలదీసింది. అదేవిధంగా ఈ దారుణం ఉదయం చోటుచేసుకోగా మధ్యాహ్నం 4 గంటల వరకు పోస్టుమార్టం పూర్తయిందని గుర్తుచేస్తూ ఎఫ్ఐఆర్ మాత్రం రాత్రి 11:45…

Read More
law 1

కొత్త చట్టాలు..

దేశంలో మూడు కొత్త న్యాయ చట్టాలు అమలు లోకి వచ్చాయి. దాదాపు 150 ఏళ్లుగా అమలులో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పిసి) స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (ఐఈఏ) స్థానంలో భారతీయ సాక్ష అధినియం (బీఎస్‌ఏ) రాబోతున్న విషయం తెలిసిందే. వీటిపై ఒకవైపు నిరసనలు వ్యక్తమవుతుండగా, మరోవైపు రాష్ట్రాల పోలీస్ యంత్రాంగం సన్నద్ధమైంది. ఇప్పటికే అనేక…

Read More
amit suprim c

“సుప్రీమ్”ని ప్రశ్నించే ధైర్యమా…

ఎనిమిది, తొమ్మిదేళ్ళ కిందటి వరకు దేశ ప్రజలకు ఎవరో కూడా తెలియని వ్యక్తి ఈ రోజు న్యాయ వ్యవస్థను తప్పుపట్టే స్థాయికి చేరారు. ప్రజా స్వామ్య దేశం అందులోనూ పదేళ్లుగా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నామన్న ఒకే ఒక ధైర్యంతో అధికారం,  పార్టీ బలం చూసుకొని షా  అదుపు లేకుండా మాట్లాడడం విస్మయానికి గురి చేస్తోంది. కేంద్రంలో బాధ్యత గల పదవిలో అంటూ దేశ ప్రధానికి కుడి భుజంగా పేరున్న అమిత్ షా ఏకంగా సుప్రీం కోర్టు ఆదేశాలు,…

Read More
IMG 20240320 WA0015

రా “గురూ”…

కోర్టు ధిక్కరణ కేసులో న్యాయస్థానం ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని యోగా గురు రాందేవ్‌ బాబాను, ఆయన యాజమాన్యం లోని పతంజలి ఆయుర్వేద్‌ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది.ఆరోగ్య రక్షణకు సంబంధించి పత్రికలలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇస్తున్నారంటూ వీరిద్దరిపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. ప్రజలను తప్పు దోవ పట్టిస్తూ మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నారంటూ పతంజలిపై గతంలో ఫిర్యాదులు వచ్చాయి.వీటిపై సుప్రీంకోర్టులో జరిగిన వాదనల సందర్భంగా ఇకపై…

Read More
IMG 20240216 WA0018

అలాంటిది ఏమీ లేదు…

”రాజధాని ఫైల్స్” సినిమా రిలీజ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. రాజధాని ఫైల్స్ విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్‌లు, రికార్డ్‌లు సక్రమం గానే ఉన్నాయని కోర్టు చెప్పింది. అయితే, ఈ చిత్రం విడుదలను నిలిపి వేయాలంటూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా నిన్న కోర్టు స్టే విధించింది. మరోసారి శుక్రవారం విచారణకు రాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అక్కడి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా సినిమా ఉందని పిటిషన్…

Read More
jayaprada3

అరెస్టుకు రంగం..

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదను అరెస్టు చేయాలంటూ ఉత్తరప్రదేశ్ లోని రాంపుర్ ప్రజా ప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల వారెంట్ జారీ చేసింది. 2019 లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై రెండు కేసులు నమోదు కాగా, వాటికి సంబంధించి ఆరు సార్లు జయప్రదకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అయినా, విచారణకు ఆమె గైర్హాజరు కావడంతో కోర్టు తీవ్రంగా పరిగణించింది. దీంతో, ఆమెను అరెస్ట్ చేసి ఈ నెల 27న న్యాయస్థానం ముందు హాజరు…

Read More
kerala c

నా తీర్పే శాసనం…!

కేరళలోని అలప్పుళ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో 15 మంది నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ నిర్ణయిం తీసుకుంది. మావెలిక్కర అదనపు కోర్టు న్యాయమూర్తి వీజీ శ్రీదేవి ఈ తీర్పు ఇచ్చారు. క్షమాభిక్ష కోరేందుకు నిందితులు అర్హులు కారని న్యాయమూర్తి తీర్పులో స్పష్టం చేశారు. తల్లి, భార్య, కూతురి ఎదుటే ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేయడం అరుదైన నేరమని, నిందితులకు మరణశిక్ష విధించాలంటూ ప్రాసిక్యూషన్ డిమాండ్ చేసింది. నిషేధిత…

Read More
dme dh c

తొలగిన “వైరస్”…!

ప్రభుత్వంలో అత్యంత కీలకమైన విభాగాల్లో ఆరోగ్య శాఖ ఒకటి. అంతటి ప్రాధాన్యం ఉన్న శాఖకు దశాబ్ద కాలంగా పట్టిన “వైరస్”వదిలిందని వైద్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ శాఖలో ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన ఒక అధికారి గత అధికార పార్టీ జెండాను భుజాన వేసుకోవలనే ఆత్రుతతో “దొర” కాళ్ళు పట్టి మరీ తిరగడం,  వైద్య కళాశాలల్లో  విద్యా బుద్ధులు చెప్పే వారికి దిశానిర్దేశం చేయాల్సిన మరో అధికారి “ఒంటెద్దు” ప్రభుత్వం తనదే అన్నట్టు వ్యవహరించడంతో  వైద్య రంగం,…

Read More
jornlist harish scaled

ఇస్తాం..ఇస్తాం..తప్పక ఇస్తాం..

హైదరబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశం త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. కొత్తగా ఏర్పాటైన “ది తెలంగాణా జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ” ప్రతినిధులతో ఆయన ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. సొసైటీ సభ్యత్వ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మూడోసారి కూడా తామే అధికారంలోకి వస్తామన్న మంత్రి హరీష్ రావు జర్నలిస్టుల హౌసింగ్ సమస్యని కూడా తప్పక పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ కలిసి ఇదే అంశంపై…

Read More
srinivas goud

గండం తప్పింది…

తెలంగాణా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ఎన్నికల అఫిడవిట్ కేసును హైకోర్టు కొట్టి వేసింది. మహబూబ్ నగర్ కు చెందిన చలవుగాలి రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ గత ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఆరోపిస్తూ, గౌడ్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. అయితే, సుదీర్ఘ విచారణ అనంతరం వివిధ అంశాలను పరిశీలించిన కోర్టు తుది తీర్పు వెల్లడించింది. రాఘవేంద్ర రాజు వేసిన ఎన్నికల కేసు చెల్లదంటూ తీర్పు…

Read More
Screenshot 20230911 105403 WhatsApp

జైలులో “బాబు”…

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి ఎసిబి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

Read More
IMG 20230906 WA0001 1

రిమాండ్…

ఆంధ్రప్రదేశ్  టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎ.సి.బి. కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. గంటల తరబడి జరిగిన వాదోపవాదనల్లో బాబు అరెస్టుకి సంబంధించి సి.ఐ.డి. పోలీసులు పకడ్బందీ ఆధారాలు చూపడంతో  న్యాయస్థానం చంద్రబాబుకు బెయిల్ నిరాకరంచింది. 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబుని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించేందుకు పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు.స్కిల్ డెవలప్ మెంట్ లో జరిగిన కుంభకోణంలో చంద్రబాబునాయుడు ప్రమేయం ఉందని శనివారం రాత్రి ఆయనను నంద్యాలలో క్యాంపు…

Read More
IMG 20230910 WA0089

నిరసన సెగలు…

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను ఖండిస్తూ టిడిపి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, నిరాహార దీక్షలు చేపట్టాయి. నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని నిలదీయడంతో పాటు రాక్షస పాలనకు వ్యతిరేకంగా ప్రజాక్షేత్రంలో ఎండగట్టడాన్ని జగన్ రెడ్డి జీర్ణించుకోలేక కక్షసాధింపు చర్యలకు దిగారని దుయ్యబట్టారు. తన అవినీతి మరకను ఇతరులకు అంటించేందుకు పన్నిన కుట్రలో భాగమే చంద్రబాబు అక్రమ అరెస్ట్ అని నిరసించారు. తండ్రి…

Read More
Screenshot 2023 08 11 153928

జయప్రదకు జైలు…!

సినీ నటి, మాజీ ఎం.పి. జయప్రదకు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే, చెన్నైలోని అన్నా రోడ్ లో  జయప్రదకు ఒక సినిమా హాలు ఉంది. ఆ సినిమా హాలు నిర్వహణ బాధ్యతలను ఆమె సోదరుడు  రాజబాబు, అతని స్నేహితుడు రామ్ కుమార్ చూస్తుంటారు. అయితే, సిబ్బందికి జీత భత్యాలు, పి.ఎఫ్., ఇఎస్ఐ, వంటి ఇతర సదుపాయాలను సరిగా కల్పించాడంలేదని రిటైర్ అయిన ఒక ఉద్యోగి కార్మిక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు….

Read More