అగ్ని గోళం వైపు..

adhitya
jadhitya 1

రోదసీలో అత్యంత క్లిష్టమైన చంద్రయాన్ -3 ప్రాజెక్టును విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. తాజాగా సూర్యునిపై పరిశోధనల కోసం నడుం బిగించింది. సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలో 24 గంటల కౌంట్ డౌన్ పూర్తి చేసుకున్న పీఎస్ఎల్వి-సి 57 రాకెట్ ఆధిత్యను తీసుకుని కక్ష్య దిశగా ప్రయాణిస్తోంది. 4 నెలల్లో భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి భానుడి ఎల్1 కక్ష్యలోకి చేరుకుంటుంది. అనంతరం అందులోని ఏడు పేలోడ్లు వివిధ అంశాలపై పరిశోధనలు చేస్తాయి. చంద్రయాన్ 3 తర్వాత ఇస్రో ప్రయోగించిన ఈ మిషన్ ఫలితాలపై ప్రతి ఒక్కరు ఆసక్తిగా చూస్తున్నారు.

భూమికి, సూర్యునికి మధ్యలో ఉండే లాగ్ రేంజ్ లోకి పీఎస్ఎల్వీ ఎక్స్ఎల్ రాకెట్ ద్వారా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ స్టేషన్ నుంచి ఆదిత్య ఎల్-1 అంతరిక్ష ఆదేశాలను పంపనుంది. భానుడి కరోనా, ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ లలో మొట్టమొదటిసారి పరిశోధనలు చేపట్టనుంది. భూమికి 15 లక్షల కిలో మీటర్ల దూరంలోని లాగ్ రేంజ్ 1 [L1] కక్ష్యలో తిరుగుతూ ఆదిత్య L1 పరిశోధనలు సాగిస్తుంది. లాగ్ రేంజ్ లో ఇది రెండో మిషన్. ఏడాది క్రితం నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ను లాగ్ రేంజ్ 2 కక్షలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *