దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విచారణపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తిరిగి ఎందుకు వేగం పెంచిందనేది ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో చర్చననీయాంశంగా మారింది. రెండు రోజుల కిందట నిందితుడు బుచ్చిబాబుని ఈ.డి. విచారించడంతో ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో కథ ఎటువైపు తిరుగుతుందో అనే గుబులు పట్టుకుంది. ఈ.డి. ఒక్కసారిగా దూకుడు పెంచిందనే దానిపై అరా తీయడం మొదలైంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ అడిటర్ బుచ్చిబాబును ఈడీ విచారించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో రకరకాల ఉహాగానాలు మొదలైయ్యాయి. గతంలో విచారించిన బుచ్చిబాబును ఈడీ అధికారులు తిరిగి ఈ అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారనేది చర్చగా మారింది. బుచ్చిబాబు వాగ్మూలాన్ని అధికారులు నమోదు చేస్తున్నట్లు బయటకు పొక్కడంతో మరింత ఆందోళన మొదలైంది. ఈ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న బుచ్చిబాబు వాంగ్మూలం కీలకంగా మారే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఎమ్మెల్సీ కవిత మాజీ అడిటర్ బుచ్చిబాబును ఈ కేసులో ఈడీ మరోసారి విచారిస్తుండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత ఉత్కంఠ నెలకొంది. గత కొన్ని రోజులుగా ఈ కేసు విచారణలో స్తబ్దంగా ఉన్న అధికారులు దర్యాప్తులో మళ్లీ వేగం పెంచారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో సంబంధం ఉన్న తెలుగువారిని ఈడీ అధికారులు గత వారం విచారించడం గమనార్హం ఇదే కేసులు ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్సీ కవితను సైతం ఈడీ విచారించిన విషయం తెలిసిందే. తెలంగాణలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెరపైకి రావడం పై అన్ని రాజకీయ పక్షాలు దీనిపై దృష్టి సారించాయి.