ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం. ఎట్టకేలకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసారు. నంద్యాలలో క్యాంపు కార్యాలయం వద్ద అర్ద్రరాత్రి హై డ్రామా చేసి ఆయన్ని అరెస్టు చేశారు. చంద్రబాబు హాయంలో జరిగిన స్కిల్ డెవలప్ మెంట్ లో జరిగిన కుంభకోణం పై సీఐడీ, ఈడీ విచారణ జరిపింది. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు పాత్ర పై చాలా రోజులుగా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.ఈ వ్యవహారంలో ఇప్పటికే అటాచ్ మెంట్లు జరిగాయి.
షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. దీంతో, ఈ కేసులో మరి కొంత మందిని అదుపులోకి తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయనపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు.