మరాఠా యోధుడు చత్రపతి శివాజీ ఉపయోగించిన “వాఘ్ నఖ్” లండన్ నుంచి తిరిగి మన దేశానికి చేరనుంది. 1659వ సంవత్సరంలో చత్రపతి శివాజీ దండ యాత్రలో భాగంగా జరిగిన పోరాటంలో సుల్తాన్ అఫ్జల్ ఖాన్ ను హతమార్చేందుకు పులి గోరు ఆకారాన్ని పోలి ఉన్న “వాఘ్ నక్”అనే ఆయుధాన్ని ఉపయోగించారు.
అప్పట్లో సతారా ఆ స్థానంలో శివాజీ వారసులు ఈ ఆయుధాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి జేమ్స్ గ్రాంట్ డఫ్ కు అందజేశారు. తర్వాత దీనని ఆయన బ్రిటన్ తీసుకువెళ్లాడు. ఆ తర్వాత డఫ్ వారుసులు ఈ ఆయుధాన్ని మ్యూజియంకు విరాళంగా అందజేశారు. ప్రస్తుతం లండన్ లోని విక్టోరియా అల్బర్ట్ మ్యూజియంలో ఉన్న ఈ ఆయుధాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ తెలిపారు.